అక్కడ ఇళ్లకు తాళాలు వేసి లాక్ డౌన్ అమలు..

దేశంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ అమలవుతోంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు చెబుతున్నా ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, వైరస్ ను అరికట్టేందుకు అదొక్కటే మార్గమని ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్న ప్రజల్లో మార్పు రావడం లేదు. ఏదో ఒక సాకు చెప్పి బయటకు వస్తున్నారు. నిత్యావసరాల కోసమని, మందులు కొనుగోలు చేయాలని బయట షికార్లు కోడుతున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పుందుకు పోలీసులు కొత్త తరహా విధానం మొదలుపెట్టారు. లాక్ డౌన్ పక్కాగా అమలు చేసేందుక పటిష్ట చర్యలు చేపడుతున్నారు. 

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు పట్టించుకోకపోవడంతో అధికారులు రూటు మార్చారు. ఇళ్లకు తాళాలు వేసి ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రజలు కేవలం ఉదయం, సాయంత్రం తాగునీరు, పాలు, ఇతర నిత్యావసరాలు అవసరమైన వారికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లేపాక్షిలో ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వీధుల్లోకి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. 

 

Leave a Comment