Viral Video: విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పై డేంజర్ బైక్ స్టంట్లు..!

బైక్ రేసింగ్, బైక్ స్టంట్ల ద్వారా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరి కొందరు ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. అయినా యువతో మాత్రం మార్పు రావడం లేదు. మరి కొందరైతే సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. తాజాగా విజయవాడలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పై డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు.

దుర్గగుడి ఫ్లైఓవర్ పై వేగంగా వెళ్తూ.. బైక్ పై నిలబడి గన్ తో పైకి కాలుస్తూ విన్యాసాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ లో కొందరు యువకుల బైక్ స్టంట్లు ప్రయాణికులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. బైక్ లకు నంబర్ ప్లేట్లను తీసేసి పోలీసులు గుర్తించకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువకులు చేసిన బైక్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియో ఆధారంగా విజయవాడ పోలీసులు యువకులను గుర్తించే పనిలో ఉన్నారు.    

 

View this post on Instagram

 

A post shared by sumanagesh (@sumanageshpaina)

Leave a Comment