టిక్ టాక్, వాట్సాప్, ట్విటర్లపై కేసు

దేశంలో తొలిసారిగాద టిక్ టాక్, ట్విటర్, వాట్సాప్ యాజమాన్యాలపై కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మతపరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్.శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఇండియన్ టిక్ టాక్, వాట్సాప్ గ్రూప్ లో పాకిస్థాన్ కి చెందిన వారు ఉన్నరని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్న వీడియోలు పాకిస్తాన్ వారు పెడితే, ఇండియాలో పెట్టినట్లు వైరల్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ ఆధారాలు పరిగణనలోకి తీసకొని తగిన చర్యలు చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు సూచించింది. రెండు రోజుల్లో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సాప్ యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. యాప్ యాజమాన్యాలపై 153 (ఎ), 121(ఎ), 294,505, రెడ్ విత్ 156(3) కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Leave a Comment