KGF2 నుంచి అధీరా లుక్..భయంకరంగా సంజయ్ దత్ లుక్..!

కేజీఎఫ్ ఒక సంచలనం. కేజీఎఫ్ చూసిన ప్రతి ఒక్కరూ కేజీఎఫ్-2 గురించి వెయిటింగ్ లో ఉన్నారు. సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కేజీఎఫ్-2పై అంచానాలు పెంచేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విలన్ పాత్ర అధీరా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్నాడు.

బుధవారం సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అధీరా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ లుక్ లో సంజయ్ దత్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. అసలు జాలి లేని క్రూరుడు పాత్ర అది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ కూడా ఉంది.  క్రూరత్వంగా ఉన్న సంజయ్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 

Leave a Comment