పాపం దొంగ..దొంగతనం చేసిన సెకన్లలోనే దొరికిపోయాడు..!

దొంగతనం చేయాలంటే దొంగలు ఎంతో ప్లానింగ్ తో వస్తారు. ఎక్కడా దొరక్కుండా ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. అంతా  అనుకూలంగా ఉంటేనే దొంగతనానికి వెళ్తారు. అయితే ఈ దొంగకు మాత్రం ఎలాంటి అనుభవం లేనట్టుంది. అందుకే దొంగతనం చేసిన సెకన్లోనే దొరికిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఓ దొంగ నగల దుకాణంలోకి వెళ్తాడు. అక్కడ బంగారం గొలుసు మెడలో వేసుకుంటాడు. ట్రైల్ వేస్తున్నట్లు నటిస్తాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ డోర్ ఓపెన్ కాదు. దీంతో చేసేది లేక చైన్ ను తిరిగి ఇచ్చేస్తాడు. కొద్ది సేపటికీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment