ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..

మెగాపవర్ స్టార్ రామచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. ఈ చిత్ర టైటిల్ ను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ అంటే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కనిపించనున్నారు. ఈ మూవీకి ఈ టైటిల్ కచ్చితంగా సరిపోతుందని భావిస్తున్నారు. 

బాలివుడ్ దిగ్గజం అజయ్ దేవ్ గన్, దేశీ బ్యూటీ ఆలియా భట్ లు కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నిటించనుండటంతో సినిమాపై అంచనాలు అకాశాన్ని అంటాయి. ఇక ఆలియా భట్ త్వరలోనే చిత్రీకరణలో పాల్గొంటారని, ఆమె పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు మూవీ షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఇప్పటికీ ఈ మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. మరోవైపు చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ లను మార్చి 27, మే 20 తేదీల్లో వారి బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

 

Leave a Comment