సీఏఏకు కేసీఆర్ నో..!

భారత పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని, అన్ని మతాలను సమానంగా చూడాలని తెలంగాణ మంత్రి మండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. లౌకికత్వానికి ప్రమాదంగా పరిణమించే పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ) ను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ శాసనసభలో కూడా దీనిపై తీర్మాన చేయాలని నిర్ణయించింది. సీఏఏపై కేంద్రం పునరాలోచించకుంటే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధి, వసతులు, సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈనెల 24 నుంచి పది రోజుల పాటు ‘పట్టణ ప్రగతి’ పేరిగ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీని విధి విధానల ఖరారుకు ఈనెల18న ప్రగతి భవన్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. లౌకికవాదానికి మారుపేరైన తెలంగాణ ప్రభుత్వం సీఏఏ వంటి చట్టాలకు వ్యతిరేకమని, దీనిపై మా విధానాన్ని దేశమంటికీ తెలిసేలా పార్లమెంటులో స్పష్టం చేశామని, వచ్చే శాశనసభ సమావేశాల్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

Leave a Comment