కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్..!

అసోంలో ఓ మహిళ పోలీస్ చేసిన పనికి ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాబోయే భర్త మోసగాడని తెలిసి.. వెంటనే అరెస్ట్ చేసింది. జున్మోనీ రభా నాగావ్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు రానా పోగాగ్ అనే వ్యక్తితో గత అక్టోబర్ లో నిశ్చితార్థం జరిగింది. తాను ఓఎన్జీసీ పనిచేస్తున్నట్లు రానా పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది నవంబర్ లో పెళ్లి కూడా జరగాల్సి ఉంది..

ఇంతలో కాబోయే భర్త గురించి జున్మోనీకి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఎంతో మంది నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు స్పష్టమైంది. తనకు కాబోయే భర్త తమ నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు ముగ్గురు బాధితులు జున్మోనిని ఆశ్రయించారు.

దీంతో వెంటనే స్పందించిన జున్మోని రానాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ సంబంధాన్ని పెద్దలు తీసుకురావడంతో అతడు మంచోడే అనుకున్నానని జున్మోని తెలిసింది. అంతేగతంలోనూ జున్మోని ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. మోసగాడని తెలిసి కాబోయే భర్తనే అరెస్ట్ చేయడంతో జున్మోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. 

 

 

Leave a Comment