‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. ‘సర్కారు వారి పాట’లో సీఎం జగన్ డైలాగ్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.. వేసవి కానుకగా మే 12న సర్కారు వారి పాట సినిమా విడుదల కానుంది. 

సర్కారు వారి పాట ట్రైలర్ లో మహేశ్ క్లాస్ అండ్ మాస్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ ని హుషారెత్తించేలా ఉన్నాయి. ట్రైలర్ బట్టి చూస్తే ఈ సినిమాను యాక్షన్, కామెడీ, లవ్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో రూపొందించారు. ‘నా ప్రేమను దొంగిలించగలవు.. నా స్నేహాన్ని దొంగిలించగలవు.. నా డబ్బును దొంగిలించలేవ్’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.

ఈ సినిమాలో దర్శకుడు పరుశురామ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఎన్నికలకు ముందు చెప్పే డైలాగ్ ని కూడా వాడుకున్నాడు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ కీర్తి సురేష్ తో మహేశ్ బాబు చెప్తాడు.. ఇక కీర్తి సురేష్ తో మహేశ్ రొమాన్స్, ఫన్నీ డైలాగులు మరో లెవల్ అని చెప్పొచ్చు.. ఇప్పటికే ఈ సినిమా పాటలు రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

Leave a Comment