జూన్ 6న RGV ‘Climax’

రామ్ గోపాల్ వర్మ తన ‘Climax’ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. జూన్ 6న ‘Climax’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. పోర్న్ స్టార్ MiaMalkova నటిస్తున్న ఈ ‘Climax’ ట్రైలర్ ను ఇప్పటికే మిలియన్ల మంది వీక్షించారు. ఈ సినిమాలో ట్రైలర్ లో మియా మాల్కోవా తన అందాల ఆరబోతతో కుర్రకారు మతిపోగోడుతుంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని RGV ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో RGV తన సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. 

అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా RGVWorld.in/ShreyasET యాప్ ద్వారా విడుదల చేయనున్నట్లు RGV చెప్పాడు. ఒక్కో షో కోసం రూ.100 కేటాయించాడు. లాగిన్ వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నాడు. మరియు ఈ సినిమా రెండో ట్రైలర్ ను శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 

ఇదిలా ఉండగా RGV ‘CoronaVirus’ సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇటీవల విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మిలియన్ల వ్యూవ్స్ పొందింది. ఈ సినిమాతో RGV కరోనా పట్ల భయాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. 

Leave a Comment