వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సమీక్ష 

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతి చేస్తున్నామని, మరోవైపు మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. టమోటా దిగుమతులు క్రమంగా తగ్గుతున్నుందున మార్కెట్లోనే అమ్ముడు పోతోందని… ఈ పంట విక్రయం విషయంలో సమస్యలు తొలగిపోయాయని అధికారులు చెప్పారు. 

బొప్పాయి, మామిడి పంట కొనుగోలుపైనా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. కర్నూలు వెలుపల ఉల్లి మార్కెట్‌ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో కూడా క్రమంగా ఎగుమతులు పెరిగాయని, కనీసం రోజూ 40 కంటైనర్ల వరకూ ఎగుమతి అవుతోందని అధికారులు చెప్పారు. అలాగే ప్రాసెసింగ్, కోల్డు స్టోరీజీ ప్లాంట్లు కూడా దాదాపుగా తెరుచుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలపై సీఎం ఆరా తీశారు. సంబంధిత రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

Leave a Comment