భారత్ లోకి కరోనా !

న్యూడిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశం లోకి ప్రవేశించింది. కేరళలో యోలి కరోనా కేసు నమోదైంది.కేరళకు చెందినా ఒక విద్యార్ధి చైనాలోని వూ హాన్ యూనివర్సిటీ లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల భరత్ కు వచ్చిన అతడికి కరోన వైరస్ సోకినట్టు భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అతడికి ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. 

పెరిగిపోతున్న మృతుల సంఖ్య..

చైనాలో కరోన వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. కరోన బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికి 170కి చేరింది. కోత్తగా మరో 1700 కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7,711కి చేరింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా హుబెయి ప్రావిన్స్ కు చెందినా వారు ఉన్నారు. 37 మంది ఆ ప్రాంతానికి చెందినా వారు ప్రాణాలు కోల్పోయారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రతి రోజు కొత్తగా 1370 కేసులు నమోదు అవుతున్నాయి. 

 కరోనాపై డబ్ల్యు హెచ్ ఓ ఆందోళన..

కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జగ్రతలపై చర్చించేందుకు డబ్ల్యు హెచ్ సమావేశం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17 దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. చైనా లోని ప్రతి రీజియన్లో కరోనా వ్యాపించినట్లు  అక్కడ మీడియా వెల్లడించింది. భరత్ లోను కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Leave a Comment