తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

0
4
YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.  

  “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి… జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది’’ అని జగన్ పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here