UCIL Recruitment 2026 : యూరేనియం కార్పొరేషన్ లో ట్రైనీ ఉద్యోగాలు

UCIL Recruitment 2026: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) మంచి అవకాశం తీసుకొచ్చింది. Graduate Operational Trainee (CR&D) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • UR – 2 పోస్టులు
  • EWS – 1 పోస్టు
  • ST – 1 పోస్టు

పోస్టు పేరు: Graduate Operational Trainee (CR&D)

అర్హతలు

అభ్యర్థులు B.Sc Chemistry లేదా B.Sc Chemistry Honors పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు కూడా ఉండాలి.

  • UR/EWS అభ్యర్థులకు కనీసం 60% మార్కులు అవసరం
  • ST అభ్యర్థులకు కనీసం 55% మార్కులు అవసరం

వయోపరిమితి

2026 మే 23 నాటికి అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, PwBD అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

  • General, EWS, OBC అభ్యర్థులకు – రూ.500
  • SC, ST, PwBD, మహిళా అభ్యర్థులకు – ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి UCIL ఎంపిక విధానాన్ని నిర్ణయిస్తుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశలకు పిలుస్తారు.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.29,990 స్టైపెండ్‌తో పాటు DA ఇస్తారు. రెండో ఏడాదిలో స్టైపెండ్ రూ.30,890కు పెరుగుతుంది.

ట్రైనింగ్ పూర్తయ్యాక Scientific Assistant-A పోస్టులో రెగ్యులర్ ఉద్యోగం ఇస్తారు. పే స్కేల్ రూ.29,990 – 46,720 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 ఏప్రిల్ 2026
  • చివరి తేదీ: 23 మే 2026 రాత్రి 11:59 వరకు

దరఖాస్తు సమయంలో 10వ తరగతి సర్టిఫికేట్, విద్యార్హత పత్రాలు, కేటగిరీ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.

Notification : Click here

Apply Online : Click here

Leave a Comment

Follow Google News