తాగుడు మాన్పించే దేవుడు.. మాల ధరిస్తే చాలు..!

0
7
పాండురంగ స్వామి

మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకునే వారు ఎందరో ఉన్నారు. తాగుడు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు ఉండవు.. అయితే తాగుడు మాన్పించేందుకు ఒక గుడి ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఆ దేవాలయానికి ఒక్కసారి వెళ్తే తాగుడు మానేస్తారట.. అందుకే ఆ గుడికి వేల మంది క్యూ కడుతున్నారట.. మరీ తాగడు మాన్పించేందుకు ఆ గుడిలో ఏం చేస్తారో తెలుసుకుందామా..

ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాండురంగ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి స్వామి వారు ఎంతో మహిమ గలవారని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా తాగుబోతులు పాండురంగ స్వామికి పూజలు నిర్వహిస్తుంటారు. అందుకే నెలలో రెండు రోజులు ఈ దేవాలయం మందుబాబులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఈ గుడికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిచి.. మాల ధరిస్తే ఇక మద్యం ముట్టరట. మెడలో పాండురంగ స్వామి మాల ఉంటే మద్యానికి ఆమడ దూరం పరిగెడతారని నమ్మకం. 

అయితే పాండురంగ స్వామి మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీల్లేదు. నెలలో రెండు రోజులు మాత్రమే..  శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లోనే మాల ధరించాలి. కేవలం తాగుడుకు బానిస అయిన వారు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం అనేది కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది.

మాల ధరించానుకున్న వారు ఏకాదశి తుది కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద రూ.100 చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను పాండురంగ స్వామి సన్నిధిలో ఉంచి పూజలు, భజను చేస్తారు. తర్వాత ఏకాదశి సూర్యోదం సమయంలో నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని దేవాలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకుడు పూజలు చేసి పాండురంగస్వామి మాలను మందుబాబుల మెడలో ధరింపజేస్తాడు. అలా పాండురంగ మాలధారణ చేసిన వారు మళ్లీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here