BECIL Ministry of Mines Recruitment 2025 : Broadcast Engineering Consultants India Limited (BECIL) — భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఒక మినీ రత్న సంస్థ. ఈ సంస్థ తాజాగా Ministry of Mines, Government of India లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
- Content Writer – 01 పోస్టు
- Graphic Designer – 01 పోస్టు
- Video Editor – 01 పోస్టు
Also Read : CSIR – NGRI Recruitment 2025 | హైదరాబాద్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్
అర్హతలు :
BECIL Ministry of Mines Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
Content Writer :
- విద్యార్హత: Journalism / Mass Communication / English / Public Relations లో Master’s Degree తప్పనిసరి.
- అనుభవం: కనీసం 2–5 సంవత్సరాల అనుభవం కంటెంట్ రైటింగ్‌లో ఉండాలి.
- నైపుణ్యాలు: English & Hindi భాషలపై మంచి పట్టు ఉండాలి.ప్రభుత్వ పత్రాలు, సోషల్ మీడియా కంటెంట్, వెబ్ కంటెంట్ రాయగలగాలి.PPTs, reports, infographics తయారు చేయగల సామర్థ్యం ఉండాలి.
Graphic Designer :
- విద్యార్హత: Graphic Design / Fine Arts / Visual Communication లో Bachelor’s Degree లేదా Diploma.
- అనుభవం: 2–5 సంవత్సరాల అనుభవం Graphic Designలో ఉండాలి.
- సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు: Adobe Photoshop, Illustrator, CorelDRAW, InDesign మొదలైన వాటిలో అనుభవం ఉండాలి.
- డిజైన్ పనులు: పోస్టర్లు, బ్యానర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, సోషల్ మీడియా క్రియేటివ్‌లు మరియు ప్రభుత్వ ప్రచార మెటీరియల్ డిజైన్ చేయాలి.
Video Editor :
- విద్యార్హత: Film Editing / Mass Communication / Multimedia లో Bachelor’s Degree లేదా Diploma.
- అనుభవం: 2–5 సంవత్సరాల వీడియో ఎడిటింగ్ అనుభవం ఉండాలి.
- సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు: Adobe Premiere Pro, Final Cut Pro, After Effects మొదలైన వాటిలో ప్రావీణ్యం అవసరం.
- పని బాధ్యతలు: ప్రోగ్రామ్‌లు, అవేర్‌నెస్ వీడియోలు, ఈవెంట్ క్లిప్స్, సోషల్ మీడియా వీడియోలు ఎడిట్ చేయడం.
వయోపరిమితి (Age Limit) :
BECIL Ministry of Mines Recruitment 2025 అభ్యర్థులకు 05.11.2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు (Application Fee) :
BECIL Ministry of Mines Recruitment 2025 అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- SC/ST/PwD అభ్యర్థులకు: ఫీజు లేదు
- ఇతర కేటగిరీలు: ₹295/-
- డీడీ పేరు: “Broadcast Engineering Consultants India Ltd, Noida” పేరిట డ్రా చేయాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process):
BECIL Ministry of Mines Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
- స్కిల్ టెస్ట్ : Content Writer & Graphic Designer పోస్టులకు 1 గంట టెస్ట్ ఉంటుంది. Video Editor పోస్టుకు 2 గంటల టెస్ట్ నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ : స్కిల్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
Also Read : Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు
జీతం వివరాలు (Salary Details) :
- Content Writer: ₹65,000/- ప్రతినెల
- Graphic Designer: ₹65,000/- ప్రతినెల
- Video Editor: ₹70,000/- ప్రతినెల
దరఖాస్తు విధానం (How to Apply):
BECIL Ministry of Mines Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేయాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు పూర్తిగా నింపాలి.
- అప్లికేషన్ ఫారమ్‌కి అవసరమైన డాక్యుమెంట్లు (సర్టిఫికేట్లు, ఐడీ ప్రూఫ్, అనుభవ పత్రాలు) జత చేయాలి.
- అప్లికేషన్ ని కింది అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి.
- అడ్రస్ : Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida – 201307 (Uttar Pradesh)
- కవర్‌పై ఇలా రాయాలి: Advertisement No.: 525 మరియు Post Applied For – _________
దరఖాస్తులకు చివరి తేదీ : 5 నవంబర్, 2025
Notification & Application : Click here
Also Read : RRC NER Apprentice Recruitment 2025 | రైల్వేలో మరో నోటిఫికేషన్ – 1104 ఖాళీలు