ఏపీ SSC హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టెకట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది. వీటిని గురువారం మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్ సైట్ http://www.bseap.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయా స్కూళ్ల హెచ్ఎంలుతమ స్కూల్ లాగాన్ ద్వారా స్కూల్ కోడ్ పాస్ వర్డ్ ను టైప్ చేసి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటిపై అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెట్లు ఈ హాల్ టికెట్లను తమ వద్ద ఉండే ఫొటోొ అటెండెన్స్ షీట్లతో సరిచేసుకుని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు రోజూ జరుగుతాయి.  

Leave a Comment