CBSL Trainee Recruitment 2025 : కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఎంపికైన అభ్యర్థులు ముంబై, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

CBSL Trainee Recruitment 2025 Overview
నియామక సంస్థ | కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL) |
పోస్టు పేరు | ట్రైనీ(Administration / Office Work) |
విభాగాలు | రిటైల్ డీలింగ్, కస్టమర్ కేర్ / KYC, IT, బ్యాక్ఆఫీస్ |
దరఖాస్తు ప్రక్రియ | 7 అక్టోబర్ – 17 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ (ఈమెయిల్ ద్వారా) |
జాబ్ లొకేషన్ | ముంబై, బెంగళూరు |
Also Read : CSIR–IMMT Recruitment 2025 | పరిశోధన సంస్థలో బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్టాక్ బ్రోకింగ్ మరియు డిపాజిటరీ సేవల పరిశ్రమలో కీలక పాత పోషిస్తుంది. ఈ సంస్థ నుంచి ట్రైనీ(Administration / Office Work) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆఫీసు-పనులు, రిటైల్ డీలింగ్, కస్టమర్ కేర్ / KYC, IT / బ్యాక్ఆఫీస్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- పోస్టు పేరు : ట్రైనీ(Administration / Office Work)
- పోస్టుల సంఖ్య : పేర్కొనబడలేదు
- విభాగాలు: రిటైల్ డీలింగ్, కస్టమర్ కేర్ / KYC, IT, బ్యాక్ఆఫీస్
జాబ్ లొకేషన్:
- 1. ముంబై కార్పొరేట్ ఆఫీస్ — Maker Chamber III, Nariman Point, Mumbai
- 2. బ్యాంక్ DP సెల్ — BGSE Towers, JC Road, Bangalore
అర్హతలు :
CBSL Trainee Recruitment 2025 అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. స్పెషల్‌గా క్యాపిటల్ మార్కెట్స్ / ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుది. ఫ్రెషర్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
CBSL Trainee Recruitment 2025 అభ్యర్థులకు 31.08.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. అనుభవం ఉన్న అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CBSL Trainee Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
CBSL Trainee Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింద దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : BOB SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ జాబ్స్
జీతం వివరాలు :
CBSL Trainee Recruitment 2025 ఇవి ట్రైనీ పోస్టులు కాబట్టి అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- స్టైఫండ్ : రూ.22,000/-
- వేరియబుల్ పే : రూ.2,000/-
- అభ్యర్థులకు నెలకు రూ.22,000 నుంచి రూ.24,000/- వరకు స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
CBSL Trainee Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లేదు.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.canmoney.in లోకి వెళ్లాలి.
- “Careers” సెక్షన్‌లోకి వెళ్లాలి.
- అక్కడ Trainee (Administration / Office Work) Application Form PDF డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి. వీటిపై సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ మరియు డాక్యుమెంట్లను ఒకే PDF లేదా ఫైల్ రూపంలో జతచేసి, ఈమెయిల్ ద్వారా పంపాలి.
- applications@canmoney.in కి మెయిల్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్, 2025
Notification | Click here |
Application Form | Click here |
Official Website | Click here |
Also Read : Engine Factory Avadi Recruitment 2025 | రక్షణ శాఖలో కాంట్రాక్ట్ జాబ్స్