NIT Warangal Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 05 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోగలరు.
NIT Warangal Recruitment 2025
పోస్టుల వివరాలు :
NIT Warangal Recruitment 2025 ద్వారా 05 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
NIT Warangal Recruitment 2025 ఫీల్డ్ ఇన్వస్టిగేటర్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ భాష నైపుణ్యం కలిగి ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ మరియు తెలుగు భాష నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నట్లయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
NIT Warangal Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
AP Government Jobs 2025 | ఏపీ మెడికల్ కాలేజీల్లో నాన్ టీచింగ్ జాబ్స్
జీతం :
NIT Warangal Recruitment 2025 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 జీతం చెల్లిస్తారు. అలాగే రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.30,000 /- జీతం చెల్లించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు :
NIT Warangal Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
NIT Warangal Recruitment 2025 ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్ మరియు తెలుగు సంబంధించిన భాష నైపుణ్యాలను పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం :
NIT Warangal Recruitment 2025 ఉద్యోగాలకు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, అప్లికేషన్ పూర్తి చేేసి vrdevi@nitw.ac.in అనే ఈమెయిల్ అడ్రస్ కి పంపాలి. ఈ ఉద్యోగాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification & Application : click here
1 thought on “NIT Warangal Recruitment 2025 | తెలంగాణలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు”