By Jahangir

Published On:

Follow Us
UNICEF Internship 2025

UNICEF Internship 2025 | యునిసెఫ్ లో ఇంటర్న్ షిప్  | ఇలా దరఖాస్తు చేసుకోండి

 UNICEF Internship 2025: గొప్ప అంతర్జాతీయ సంస్థ అయిన యునిసెఫ్ లో విద్యార్థులకు మరియు ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి ఇంటర్న్ షిప్ అవకాశాలను అందిస్తుంది. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్లు  ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యునిసెఫ్ లో ఇంటర్న్ షిప్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఏం అర్హతలు కావాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

UNICEF Internship 2025

యునిసెఫ్ ఇంటర్న్ షిప్ వివరాలు : 

విద్యార్థులు మరియు ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కార్పొరేట్ ప్రపంచంలో లైవ్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి ఈ ప్రోగ్రామ్ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఇంటర్న్ షిప్ మానవతా రంగంలో ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది. 

అర్హతలు : 

UNICEF Internship 2025 యునిసెఫ్ ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్స్ లేదా పీహెచ్ డీ లో చేరి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత రెండేళ్లలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వారు ఈ ఇంటర్న్ షిప్ కి అప్లయ్ చేసుకోవచ్చు.  అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ లేదా స్పానిష్ లేదా యునిసెఫ్ యొక్క వర్కింగ్ లాంగ్వేజ్ లలో కనీసం ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 

వయస్సు : 

UNICEF Internship 2025 యునిసెఫ్ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.   

ఇంటర్న్ షిప్ వ్యవధి : 

UNICEF Internship 2025 యునిసెఫ్ గ్లోబల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ఆరు నుంచి ఇరవై వారాల వరకు ఉంటుంది. అవసరాలను బట్టి ఈ ఇంటర్న్ షిప్ ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ కావచ్చు. యునిసెఫ్ ఇంటర్న్ షిప్ లో పాల్గొనే వారు పరిశోధన, డేటా బేస్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్స్ తో పాటు ఇతర రంగాల్లో అనేక ప్రాజెక్టుల్లో పనిచేస్తారు. 

జీతం : 

UNICEF Internship 2025 యునిసెఫ్ ఇంటర్న్ షిప్ కి ఎంపికైన అభ్యర్థులక స్టైఫండ్ ఇస్తారు. ఒకవేళ నిధులు ఉంటే ప్రయాణ, వీసా ఖర్చులకు కంట్రిబ్యూషన్ గా ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించవచ్చు. 

దరఖాస్తు విధానం : 

  • UNICEF Internship 2025 యునిసెఫ్ ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి UNICEF  అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • తర్వాత హోమ్ పేజీలో ‘కెరీర్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • అక్కడ ‘ఇంటర్న్ షిప్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • అక్కడ మీ అర్హతలను బట్టి ఇంటర్న్ షిప్ ఆప్షన్ ఎంచుకోవాలి. 
  • అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫారమ్ నింపి సబ్మిట్ చేయాలి. ఆ కాపీని భవిష్యత్తు రెఫరెన్స్ కోసం డౌన్ లోడ్ చేసుకోండి.   

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!