మంత్రి కొండా సురేఖపై భగ్గుమన్న సినీ ఇండస్ట్రీ.. సమంతకు అండగా హీరోలు..! 

0
7
Konda Surekha

రాజకీయాల్లో నాయకుల మధ్య ఆరోపణలు సాధారణమే..అయితే ఈ ఆరోపణలు తెలంగాణాలో తారాస్థాయికి చేరాయి.  తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్లో అక్కినేని కుటుంబాన్ని కూడా లాగారు. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్ కారణమన్నారు. ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని, సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని, వాళ్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని బ్లాక్ మెయిల్ చేశాడని, ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు అని మండి పడ్డారు. 

బాపూ ఘాట్ లోని గాంధీ జయంతి మీడియా సమావేశంలో కొండా సురేఖ ఈ ఆరోపణలు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. చాలా మంది విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమమన్నారు. దుబాయి నుంచి బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియా నడుపుతోందని ఆరోపించారు. మంత్రి సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మంత్రి సురేఖ చేసిన ఈ ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, వెంటకేష్ తో సహా చాలా మంది ఆమె కామెంట్స్ పై స్పందించారు. మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ పై ఎవరేమన్నారంటే.

  • ‘ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా. ఒక కూతురి తండ్రిగా భార్యకు, భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకోవద్దని పబ్లిక్ గా అభ్యర్థిస్తున్నా’ – హీరో మహేష్ బాబు..
  • ‘వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతాం’ – మంచు విష్ణు
  • ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురద్రుష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్న వారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటి సహించదు’ – విక్టరీ వెంకటేష్
  • ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలప చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్క్రుతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యాతాయుతంగా ప్రవర్తించాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరుతున్నా’ – అల్లు అర్జున్ 
  • ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ – మెగాస్టార్ చిరంజీవి
  • ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోపత్యను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ – Jr NTR 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here