APDC Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్ మరియు సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి సెప్టెంబర్ 23వ తేదీలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

APDC Recruitment 2025 Overview
సంస్థ | ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) |
నోటిఫికేషన్ నంబర్ | APDC/VACANCIES/05/2025 |
ఉద్యోగ రకం | ఔట్సోర్సింగ్/తాత్కాలిక |
ఖాళీల సంఖ్య | 11 |
దరఖాస్తు విధానం | ఈమెయిల్ ద్వారా |
చివరి తేదీ | 23 సెప్టెంబర్ 2025, సాయంత్రం 5:00 PM |
అధికారిక వెబ్సైట్ | apdc.ap.gov.in |
Also Read : NIT Andhra Recruitment 2025 | స్పోర్ట్ కోచ్ పోస్టులకు వాక్ ఇన్స్
ఖాళీల వివరాలు :
డిజిటల్ రంగంలో ఆసక్తి కలిగిన వారికి మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) తాజాగా సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్ మరియు సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టుల కోసం తాత్కాలిక/ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇది డిజిటల్ మరియు సోషల్ మీడియా రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.
పోస్టు పేరు | ఖాళీలు |
సోషల్ మీడియా అనలిస్ట్ | 05 |
డిజిటల్ క్యాంపెయినర్ | 05 |
సెక్యూరిటీ కన్సల్టెంట్ | 01 |
మొత్తం | 11 |
అర్హతలు :
APDC Recruitment 2025 పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభుత్వ ప్రొటోకాల్ మరియు డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అనుభవం ఉన్న వారికి ప్రాధానత్య ఇస్తారు.
- సోషల్ మీడియా అనలిస్ట్ : B.E/B.Tech/MCA + కనీసం 3 ఏళ్ల అనుభవం, అందులో 1 సంవత్సరం సోషల్ మీడియా వర్క్
- డిజిటల్ క్యాంపెయినర్ : ఏదైనా డిగ్రీ + కనీసం 3 ఏళ్ల అనుభవం, అందులో 1 సంవత్సరం సోషల్ మీడియా వర్క్
- సెక్యూరిటీ కన్సల్టెంట్ : B.E/B.Tech + కనీసం 3 ఏళ్ల అనుభవం, Python, C, C++, MySQL, Cyber Security లో జ్ఞానం.
వయోపరిమితి :
APDC Recruitment 2025 ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి మరియు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వయస్సు గురించి నోటిఫికేషన్ లో ప్రస్తావించలేదు.
అప్లికేషన్ ఫీజు :
APDC Recruitment 2025 అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
APDC Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- స్కిల్ టెస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
APDC Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- సోషల్ మీడియా అనలిస్ట్ : రూ.30,000/-
- డిజిటల్ క్యాంపెయినర్ : రూ.25,000/-
- సెక్యూరిటీ కన్సల్టెంట్ : రూ.60,000/-
దరఖాస్తు విధానం :
APDC Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు తమ రెజ్యూమే/CV మరియు కవర్ లెటర్ ను ఒకే PDF (5MB లోపు) గా సిద్ధం చేయాలి.
- ఆ PDF లో అవసరమైన సర్టిఫికేట్లు (ఫోటో, DOB, కుల ధృవీకరణ, SSC నుండి PG వరకు విద్యార్హతలు) ఉండాలి.
- దరఖాస్తును info.apdcl@gmail.com కి ఈమెయిల్ చేయాలి.
- సబ్జెక్ట్ లైన్ లో తప్పనిసరిగా Post Code ప్రస్తావించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 23 సెప్టెంబర్, 2025 సాయంత్రం 5:00 లోపు
Notification | Click here |
Official Website | Click here |
Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్
1 thought on “APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్ ”