నవంబర్ 3న మెగా డీఎస్సీ..! 

0
5
AP DSC 2024

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాాయ పోస్టులకు నవంబర్ 3న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. టెట్ ఫలితాలను నవంబర్ 2న ప్రకటించి.. మరుసటి రోజు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. కానీ ఇంత వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అందుకే మరింత ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావించింది. 

మరోవైపు టెట్ పరీక్షలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. టెట్, మెగా డీఎస్సీకి  మధ్య ఎక్కువ సమయం ఉండాలని భావించి.. ప్రిపరేషన్ కోసం ఒక్కోదానికి మూడేసి నెలలు సమయం ఇచ్చారు. డీఎస్సీలో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించింది. టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలు విడుదల అయిన మరుసటి రోజు అంటే నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు, సిలబస్ వంటివి https://aptet.apcfss.in లో అందుబాటులో ఉంటాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, నిర్వహణలో ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పటిష్టంగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

మొత్తం పోస్టులు – 16,347

సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,371

స్కూల్ అసిస్టెంట్లు – 7,725

ట్టైన్డ్ గ్రాడ్యుయేట్లు – 1781

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 286

ప్రిన్సిపల్ పోస్టులు-  52

పీఈటీలు – 132

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here