అమ్మో బిస్కెట్లలో ఇనుప తీగ.. మీ పిల్లలు జాగ్రత్త..!

0
6
Bourbon Biscuit

బిస్కెట్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక చిన్న పిల్లలకు  అయితే బిస్కెట్లు అంటే మరింత ఇష్టం.. ఇటీవల నాణ్యత లేని తినుబండారాలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా మంది బ్రాండెడ్ బిస్కెట్లు, చాక్లెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బ్రాండ్ బిస్కెట్లు తినాలన్నా భయపడాల్సి వస్తుంది. సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో బిస్కెట్ లో ఇనుప తీగ రావడం అందరినీ షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో ఒకదానిలో సన్నని ఇనుప తీగ వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో వెలుగుచూసింది. 

దేవునిపల్లి గ్రామంలోని స్థానిక దుకాణంలో హనుమంతరెడ్డి అనే వ్యక్తి బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అతని పిల్లలు ఆ బిస్కెట్లు తింటుండగా సన్నని ఇనుప తీగ వచ్చింద. దీంతో ఆ బిస్కెట్ ని ఆ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేేశాడు. పిల్లలు అలాంటి ఉత్పత్తులను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

Xలో కలుషితమైన ఈ బిస్కట్ల చిత్రాలను షేర్ చేస్తూ ఇలాంటి కలుషితమైన ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బిస్కట్లు బ్రిటానియా కంపెనీకి చెందిన బోర్బన్ బిస్కట్లుగా అతడు పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here