AP DMHO Recruitment 2025 |  DMHO ఆఫీస్ లో ఉద్యోగాలు

AP DMHO Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద చిత్తూరు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద జరుగుతున్నాయి. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక అభ్యర్థులు 2025 అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు : 

చిత్తూరు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మెడికల్ ఆఫీసర్ : 13
  • స్టాఫ్ నర్స్ : 20
  • ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ : 1
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II : 3
  • ఫిజియోథెరపిస్ట్ : 1
  • ఆడియోమెట్రిషియన్ : 2
  • శానిటరీ అటెండెంట్ : 2
  • సపోర్టింగ్ స్టాఫ్ : 4
  • సెక్యూరిటీ గార్డు : 2
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 8

Also Read : IPPB Executive Recruitment 2025 | పోస్టల్ లో బంపర్ జాబ్స్

అర్హతలు : 

అభ్యర్థులు చిత్తూరు జిల్లా స్థానికులు అయి ఉండాలి. పోస్టును అనుసరించి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • మెడికల్ ఆఫీసర్ : MBBS డిగ్రీ ఉండాలి. A.P. Medical Councilలో రిజిస్ట్రేషన్ మరియు రిన్యూవల్ ఉండాలి.
  • స్టాఫ్ నర్స్ : GNM (General Nursing & Midwifery) లేదా B.Sc Nursing పూర్తిచేసి ఉండాలి. A.P. Nursing & Midwives Councilలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్ కన్సల్టెంట్ : Inter CA / Inter ICWA / M.Com లేదా MBA (Finance) పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ జ్ఞానం, ఇంగ్లీష్ మరియు తెలుగు టైపింగ్‌లో ప్రావీణ్యం అవసరం. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II : Intermediate తర్వాత 1 సంవత్సరపు Lab Technician కోర్సు లేదా SSC తర్వాత 2 సంవత్సరాల కోర్సు లేదా B.Sc (MLT) / B.Sc (BZC) తో PG Diploma in MLT ఉండాలి. A.P. Para Medical Boardలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • ఫిజియోథెరపిస్ట్ : Bachelor Degree in Physiotherapy (BPT) ఉండాలి. A.P. Para Medical Board లేదా Rehabilitation Council of Indiaలో రిజిస్ట్రేషన్ ఉండాలి.
  • ఆడియోమెట్రిషియన్ : Intermediate లేదా సమాన అర్హతతో పాటు B.Sc (Audiology) లేదా Diploma in Audiometric Technician కోర్సు పూర్తిచేసి ఉండాలి. Rehabilitation Council of Indiaలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • శానిటరీ అటెండెంట్ : SSC (10వ తరగతి) ఉత్తీర్ణత అవసరం.
  • సపోర్టింగ్ స్టాఫ్ : SSC ఉత్తీర్ణత ఉండాలి.
  • సెక్యూరిటీ గార్డ్ : SSC ఉత్తీర్ణత ఉండాలి.
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : SSC ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి : 

30.09.2025 నాటికి అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC వారికి 5 సంవత్సరాల సడలింపు, ఎక్స్-సర్వీస్‌మెన్ / మహిళలకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. District Medical & Health Officer, Chittoor పేరుతో డిడి తీయాలి.

ఎంపిక ప్రక్రియ: 

అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • 75 మార్కులు – విద్యార్హతలో పొందిన శాతం మార్కులు.
  • 15 మార్కులు – కాంట్రాక్ట్ లేదా ప్రభుత్వ సేవ అనుభవానికి.
  • 10 మార్కులు – COVID-19 సేవ, గ్రామీణ లేదా ట్రైబల్ ప్రాంత సేవలకు.

Also Read : SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • Medical Officer: ₹61,960 ప్రతినెల
  • Staff Nurse: ₹27,675 ప్రతినెల
  • Finance cum Logistic Consultant: ₹42,791 ప్రతినెల
  • Lab Technician Grade-II: ₹23,393 ప్రతినెల
  • Physiotherapist (Multi Rehabilitation Worker): ₹23,494 ప్రతినెల
  • Audiometrician: ₹25,526 ప్రతినెల
  • Sanitary Attendant: ₹15,000 ప్రతినెల
  • Supporting Staff: ₹15,000 ప్రతినెల
  • Security Guard: ₹15,000 ప్రతినెల
  • Last Grade Services: ₹15,000 ప్రతినెల

దరఖాస్తు విధానం : 

  • అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేయండి.
  • ఫారమ్ పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లు అటాచ్ చేయండి.
  • ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్‌తో కలిపి DM&HO కార్యాలయం, చిత్తూరు లో 22.10.2025 సాయంత్రం 5 గంటలలోపు స్వయంగా సమర్పించాలి.
  • పోస్టు / కూరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు పరిగణించబడవు.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 9 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 22 అక్టోబర్, 2025
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : TGSRTC Driver & Shramik Recruitment 2025 | RTCలో భారీ నోటిఫికేషన్..1,743 పోస్టులు భర్తీ

1 thought on “AP DMHO Recruitment 2025 |  DMHO ఆఫీస్ లో ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!