ICG Recruitment 2025 | కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు | 10th, 12th పాసైన వారు వదలొద్దు..

ICG Recruitment 2025 : Indian Coast Guard (ICG) నుంచి నావిక్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియన ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 300 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుకున్న వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ICG Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 300

నావిక్ జనరల్ డ్యూటీ : 260

నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ : 40

విద్యార్హతలు : ICG Recruitment 2025

నావిక్ జనరల్ డ్యూటీ : ఈ పోస్టులకు కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ లతో ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ : ఈ పోస్టులకు కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Navy SSC Officer Recruitment 2025 | ఇండియన్ నేవిలో 270 జాబ్స్ |

Border Roads Organisation Recruitment 2025 | రోడ్డు రవాణా సంస్థలో 411 ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అటెండర్ లెవెల్ జాబ్స్

వయస్సు :

Indian Coast Guard Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

Indian Coast Guard Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఎంపిక ప్రక్రియ :

Indian Coast Guard Recruitment 2025 నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం :

Indian Coast Guard Recruitment 2025 నావిక్ జనరల్ డ్యూటీ మరియు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొత్తం అలవెన్సులు కలుపుకుని రూ.42,000 జీతం అయితే అందజేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం :

Indian Coast Guard Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల అనేవి ఫిబ్రవరి 11 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. 11 ఫిబ్రవరి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.

Notification : CLICK HERE

Website : CLICK HERE

1 thought on “ICG Recruitment 2025 | కోస్ట్ గార్డ్ లో నావిక్ పోస్టులు | 10th, 12th పాసైన వారు వదలొద్దు..”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!