BECIL Recruitment 2025: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకిి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 10th, 12th, డిగ్రీ అర్హతలు ఉండాలి. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
BECIL Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టులు : 54
పోస్టుల కేటాయింపు : BECIL Recruitment 2025 ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేేయనున్నారు. వీటిలో మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ – 04, ఫుడ్ బేరర్ – 16, టెక్నాలజిస్ట్ – 05, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ – 10, అసిస్టెంట్ డైటీషియన్ – 10, పేషెంట్ కేర్ మేనేజర్ – 04, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – 01, ల్యాబ్ అటెండెంట్ – 01, డెంటల్ టెక్నీసియన్ – 03 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు : BECIL Recruitment 2025
-MRT – డిగ్రీ
-ఫుడ్ బేరర్ – 10వ తరగతి లేదా ఇంటర్
-టెక్నాలజిస్ట్ – ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో డిగ్రీ
-MLT – మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా MLT డిప్లొమా
-అసిస్టెంట్ డైటీషియన్ – న్యూట్రిషన్ / డైటెటిక్స్ లో ఎంఎస్సీ
-పీసీసీ – సంబంధిత విభాగంలో డిగ్రీ
-పీసీఎం – డిగ్రీ
-ల్యాబ్ అటెండెంట్ – 12వ తరగతి
-డెంటల్ టెక్నీషియన్ – డెంటల్ టెక్నాలజీలో డిప్లొమా
HPCL Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో 234 జాబ్స్ | రూ.1,20,000 వరకు జీతం
CISF Constable Recruitment 2025 | CISF కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు | 10th అర్హతతో 1124
వయస్సు :
BECIL Recruitment 2025 ఉద్యోగాలకు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BECIL Recruitment 2025 అప్లికేషన్ ఫీజును ఆఫ్ లైన్ ద్వారా చెల్లించాలి. జనరల్ / ఓబీసీ / మహిళలు రూ.590, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.295 ఫీజును ఆఫ్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, నోయిడా పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపు చేయాలి. ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తును సమర్పించి, ప్రతి పోస్టుకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం :
BECIL Recruitment 2025 పోస్టులకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు నింపిన అప్లికేషన్ ని అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జత చేసి కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాల్సి ఉంటుంది.
Address :
Broadcast Engineering Consultants India Limited(BECIL),
BECIL Bhawan,
C–56/A-17, Sector-62,
Noida-201307(UP)
జీతం :
BECIL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు MRT పోస్టులకు రూ.20,903, ఫుడ్ బేరర్స్ కు రూ.18,933, పీసీఎం పోస్టులకు రూ.30,000, ఎంఎల్టీ పోస్టులకు రూ.40,710 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 12 -02 – 2025
Notification & Application : CLICK HERE
1 thought on “BECIL Recruitment 2025 | రూ.40 వేల జీతంతో BECIL నుంచి ఉద్యోగాలు | కొన్ని రోజులే గడవు”