Sangeet Natak Akademi Recruitment 2025 సంగీత నాటక అకాడమీలో ఖాళీగా ఉన్న వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Sangeet Natak Akademi Recruitment 2025
పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు మరియు జీతం :
మొత్తం పోస్టులు : 16
డిప్యూటీ సెక్రటరీ (డాక్యుమెంటేషన్):
సంగీత నాటక అకాడమీలో డిప్యూటీ సెక్రటరీ పోస్టులు 01 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మాస్టర్ డిగ్రీ చేసి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. డిప్యూటీ సెక్రటరీ ఉద్యోగానికి 50 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.67,700 నుంచి రూ.2,09,700 వరకు జీతం అందజేస్తారు.
స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్ & హిందీ) :
సంగీత నాటక అకాడమీలో స్టెనోగ్రాఫర్ పోస్టులు 02 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 12వ తరగి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ మరియు టైపింగ్ స్కిల్స్ కలగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 27 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం అందజేస్తారు.
KVS Recruitment 2025 | AP కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలు | ఇంటర్వ్యూ చేసి జాబ్
రికార్డింగ్ ఇంజనీర్ :
సంగీత నాటక అకాడమీలో రికార్డింగ్ ఇంజనీర్ పోస్టులు 01 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సౌండ్ రికార్డింగ్ లో డిప్లొమా మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. రికార్డింగ్ ఇంజనీర్ ఉద్యోగానికి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం అందజేస్తారు.
అసిస్టెంట్ :
సంగీత నాటక అకాడమీలో అసిస్టెంట్ పోస్టులు 04 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగ ఉండాలి. అసిస్టెంట్ ఉద్యోగానికి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం అందజేస్తారు.
జూనియర్ క్లర్క్ :
సంగీత నాటక అకాడమీలో జూనియర్ క్లర్క్ పోస్టులు 03 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. జూనియర్ క్లర్క్ ఉద్యోగానికి 27 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం అందజేస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) ::
సంగీత నాటక అకాడమీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 05 ఉన్నాయి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి 25 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం అందజేస్తారు.
Sangeet Natak Akademi Recruitment 2025
అప్లికేషన్ ఫీజు :
సంగీత నాటక అకాడమీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ ::
Sangeet Natak Akademi Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.
-డిప్యూటీ సెక్రటరీ పోస్టుకు రాత పరీక్ష 70 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు నిర్వహిస్తారు.
-స్టెనోగ్రాఫర్ పోస్టులకు రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. తర్వాత షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
-రికాార్డింగ్ ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్ష 50 మార్కులకు మరియు ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ 50 మార్కులు నిర్వహిస్తారు.
-అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులకు మరియు డిస్క్రిప్టివ్ పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు.
-జూనియర్ క్లర్క్ ఉద్యోగానికి 100 మార్కులకు రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
-MTS ఉద్యోగానికి 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
Sangeet Natak Akademi Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేేసేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ లో దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 04 ఫిబ్రవరి, 2025
ఆన్ లైన్ లో దరఖాస్తులకు చివరి తేేదీ : 05 మార్చి 2025
Notification & Apply Online : CLICK HERE
1 thought on “Sangeet Natak Akademi Recruitment 2025 | సంగీత నాటక అకాడమీలో ఉద్యోగాలు | తక్కువ పోటీ ఉండే జాబ్స్”