RRC ECR Sports Quota Recruitment 2025 : ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR), హజీపూర్ క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025-26 నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అథ్లెట్లు ఈ నియామకాల ద్వారా రైల్వేలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మొత్తం 56 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో HQ/ECR Hajipurలో 31 పోస్టులు, అలాగే ధన్‌బాద్, దానాపూర్, డీడీయూ, సోనేపూర్, సమస్తీపూర్ డివిజన్లలో 25 పోస్టులు ఉన్నాయి.
ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతాయి. అంటే అభ్యర్థుల క్రీడా విజయాలు, ట్రయల్ ప్రదర్శన మరియు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. వయోపరిమితి 18–25 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్‌ను పూర్తిగా పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఎవరెవరు అప్లై చేయవచ్చు?
- భారతదేశ పౌరులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆల్-ఇండియా రిక్రూట్‌మెంట్.
- వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి (01.01.2026 నాటికి).
- క్రీడా అర్హతలు తప్పనిసరి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన Category A/B/C టోర్నమెంట్స్ లో పాల్గొని జాతీయ/అంతర్జాతీయ స్థాయి ప్రతిభ చూపాలి.
- విద్యార్హతలు మరియు క్రీడా అర్హతలు సరిపోతే దేశంలోని ఏ రాష్ట్రం అభ్యర్థి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

RRC ECR Sports Quota Recruitment 2025 Overview
నియామక సంస్థ | RRC ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ECR ) |
పోస్టు పేరు | స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ – సి మరియు గ్రూప్-డి పోస్టులు |
ఖాళీల సంఖ్య | 56 |
దరఖాస్తు ప్రక్రియ | 20 సెప్టెంబర్ – 21 అక్టోబర్, 2025 |
Also Read : Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్
ఖాళీల వివరాలు :
ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి.
పే లెవల్ | లొకేషన్ | ఖాళీలు |
పే లెవల్ 4/5 | HQ/ECR Hajipur | 5 |
పే లెవల్ 2/3 | HQ/ECR Hajipur | 16 |
పే లెవల్ 1 | HQ/ECR Hajipur | 10 |
పే లెవల్ 1 | ధన్‌బాద్, దానాపూర్, డీడీయూ, సోనేపూర్, సమస్తీపూర్ | 25 |
అర్హతలు :
RRC ECR Sports Quota Recruitment 2025 పే లెవల్ ని బట్టి పోస్టుల విద్యార్హతలు మారుతాయి.
- Pay Level 4/5: Graduation (డిగ్రీ)
- Pay Level 2/3: 12వ తరగతి లేదా ITI
- Pay Level 1: 10వ తరగతి లేదా ITI
క్రీడా అర్హతలు:
- Level 4/5: Category A టోర్నమెంట్‌లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించాలి లేదా Category Bలో 3వ స్థానం పొందాలి.
- Level 2/3: Category Bలో దేశాన్ని ప్రాతినిధ్యం వహించాలి లేదా Category Cలో 3వ స్థానం పొందాలి.
- Level 1: Category C టోర్నమెంట్‌లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించాలి లేదా Federation Cupలో 3వ స్థానం పొందాలి.
వయోపరిమితి :
RRC ECR Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎటువంటి వయోసడలింపు లేదు.
అప్లికేషన్ ఫీజు :
RRC ECR Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు IPO (Indian Postal Order) రూపంలో మాత్రమే చెల్లించాలి.
- సాధారణ అభ్యర్థులు: ₹500 (పరీక్షకు హాజరైన వారికి ₹400 రిఫండ్)
- SC/ST/మహిళలు/మైనారిటీలు/ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులు: ₹250 (పరీక్షకు హాజరైన వారికి పూర్తిగా రిఫండ్)
ఎంపిక ప్రక్రియ:
RRC ECR Sports Quota Recruitment 2025 ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతాయి. అంటే అభ్యర్థుల క్రీడా విజయాలు, ట్రయల్ ప్రదర్శన మరియు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- Sports Trial – 40 మార్కులు
- Sports Achievements – 50 మార్కులు
- Educational Qualification – 10 మార్కులు
- మొత్తం = 100 మార్కులు
కనీస అర్హత మార్కులు:
- Level 4/5 → 70
- Level 2/3 → 65
- Level 1 → 60
Also Read : VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్
జీతం వివరాలు :
RRC ECR Sports Quota Recruitment 2025 ఎంపికై అభ్యర్థులకు పే లెవల్ ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుంది.
- Level 1: ₹18,000
- Level 2/3: ₹19,900 – ₹21,700
- Level 4/5: ₹25,500 – ₹29,200
దరఖాస్తు విధానం :
RRC ECR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు A4 పేపర్‌పై హిందీ/ఇంగ్లీష్‌లో అప్లికేషన్ ఫారం స్వయంగా రాయాలి.
- ఫోటో అతికించి సంతకం చేయాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు (విద్య, క్రీడ, కులం, వయసు) జత చేయాలి.
- ఫీజు (IPO రూపంలో) జత చేయాలి.
- దరఖాస్తు ఈ చిరునామాకు పంపాలి:
General Manager (P),
East Central Railway,
Hajipur, Bihar – 844101
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 20, సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21, అక్టోబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
4 thoughts on “RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్”