Panjab & Sind Bank LBO Recruitment 2025 | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్

Panjab & Sind Bank Recruitment 2025 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ / స్కేల్ -1(JMGS-1) లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్(LBO) పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

Panjab & Sind Bank LBO Recruitment 2025 Overview

నియామక సంస్థపంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
పోస్టు పేరులోకల్ బ్యాంక్ ఆఫీసర్ (JMGS-1)
ఖాళీల సంఖ్య750
దరఖాస్తు ప్రక్రియ20 ఆగస్టు – 04 సెప్టెంబర్, 2025
వయోపరిమితి20 – 30 సంవత్సరాలు
జాబ్ లొకేషన్వివిధ రాష్ట్రాలు

ఖాళీల వివరాలు : 

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 750 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 

రాష్ట్రాల వారీగా ఖాళీలు : 

రాష్ట్రంఖాళీలు
ఆంధ్రపద్రేశ్80
తెలంగాణ85
ఛత్తీస్ గఢ్40
గుజరాత్100
హిమాచల్ ప్రదేశ్30
జార్ఖండ్35
కర్ణాటక65
మహారాష్ట్ర100
ఒడిశా85
పుదుచ్చేరి5
పంజాబ్60
తమిళనాడు85
అస్సాం15
మొత్తం750

అర్హతలు : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్ లో 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / EWS / OBC : రూ.850/-
  • SC / ST / PWD : రూ.100/-

ఎంపిక ప్రక్రియ : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 – రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : 

Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ విభాగంలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి,  దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 04 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News