KVS Recruitment 2025 ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన పీఎం కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హత ఉండే వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయం నుంచి ఈ నోటిఫికేష్ జారీ అయ్యింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు:
KVS Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, యోగా ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ మరియు ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ మరియు తెలుగు లాంగ్వేజ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయస్సు :
KVS Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
అర్హతలు :
KVS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి D.ed & B.ed, PG పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఉండాలి. ప్రైమరీ టీచర్స్ మరియు ట్రైన్డ్ టీచర్స్ కి CTET సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
SAI Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ | నెలకు రూ.60,000 జీతం
SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 241 జాబ్స్ | నెలకు రూ.72,000 జీతం
జీతం :
KVS Recruitment 2025 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో జీతాాల గురించి వివరించలేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను బట్టి జీతాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
KVS Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో డైరెక్టుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుుంది. ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఇంటర్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ తేేదీలు:
ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో కింద ఇచ్చిన అడ్రస్ లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
17వ తేదీ ఇంటర్వ్యూ :: ఉదయం 10 గంటలకు ప్రైమరీ టీచర్స్ కి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
18వ తేదీ ఇంటర్వ్యూ :: ఉదయం 10 గంటలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT) ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ పోస్టులకు మరియు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సంస్క్రుతం సబ్జెక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
19వ తేదీ ఇంటర్వ్యూ :: ఉదయం 10 గంటలకు యోగా ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ మరియు తెలుగు టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఇంటర్వ్యూ చిరునామా : PM Shri Kendriya Vidyalaya Nellore, Near Rajiv Swagruha Apartment, Kothur, Nellore.
Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “KVS Recruitment 2025 | AP కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలు | ఇంటర్వ్యూ చేసి జాబ్”