IIT Hyderabad Recruitment 2025: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాదపతికన భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ 11 నెలల పాటు ఉంటుంది. అభ్యర్థుల పనితీరు ఆధారంగా పొడిగించే అవకాశం ఉంటుంది.
- పోస్టు పేరు : ప్రాజెక్ట్ అసిస్టెంట్
- ఖాళీల సంఖ్య : 02
Also Read : Canara Bank Securities Recruitment 2025 | కెనరా బ్యాంకులో భారీ నోటిఫికేషన్
అర్హతలు :
IIT Hyderabad Recruitment 2025 కనీసం 65% శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
- అభ్యర్థులకు అడ్మినిస్ట్రేషన్ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- MS Office, ఈమెయిల్ డ్రాఫ్టింగ్ వంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
వయోపరిమితి :
IIT Hyderabad Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IIT Hyderabad Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
IIT Hyderabad Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
Also Read : Shipping Corporation of India Recruitment 2025 | భారీ జీతంతో అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీతం వివరాలు :
IIT Hyderabad Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.30,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
IIT Hyderabad Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు IIT Hyderabad అధికారిక వెబ్‌సైట్ https://iith.ac.in/careers/ కి వెళ్లాలి.
- అక్కడ “Temporary Positions” లేదా “Recruitments” అనే విభాగంలో Project Assistant (CCE) నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- Online Application Form లో మీ పూర్తి వివరాలు నమోదు చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, ఇమెయిల్ ID, మొబైల్ నెంబర్ మొదలైన అన్ని వివరాలు సరిగా నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆ తర్వాత అప్లకేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 04.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 25.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IOCL Engineer Recruitment 2025 | రూ.17.7 లక్షల ప్యాకేజీతో IOCLలో ఉద్యోగాలు