HPCL Recruitment 2025 : Hindustan Petroleum Corporation Limited(HPCL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్త చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
HPCL Junior Executive Recruitment 2025
పోస్టుల వివరాలు:
Hindustan Petroleum Corporation Limited(HPCL) రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 234 ఉన్నాయి.
పోస్టుల కేటాయింపు : జనరల్ -96, ఓబీసీ -63, ఈడబ్ల్యూఎస్ – 23, ఎస్సీ -35, ఎస్టీ -17
CISF Constable Recruitment 2025 | CISF కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు | 10th అర్హతతో 1124
Sangeet Natak Akademi Recruitment 2025 | సంగీత నాటక అకాడమీలో ఉద్యోగాలు | తక్కువ పోటీ ఉండే జాబ్స్
అర్హతలు :
HPCL Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. జనరల్ / ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయస్సు:
HPCL Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
HPCL Junior Executive Recruitment 2025 ఉద్యోగాలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
HPCL Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
HPCL Junior Executive Recruitment 2025 దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం :
HPCL Junior Executive Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన లింక్ కింద ఇవ్వడం జరిగింది.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14 – 02 – 2025
Apply Online : CLICK HERE
1 thought on “HPCL Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో 234 జాబ్స్ | రూ.1,20,000 వరకు జీతం”