ఇప్పుడంతా ‘దేవర’ మేనియా..100 కోట్ల కలెక్షన్ ఖాయమేనా? 

ప్రస్తుతం ‘దేవర’(Devara) మేనియాతో ప్రపంచం ఊగిపోతోంది.. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. Jr.NTR దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తున్నారు. ఇప్పటికే  Devara సినిమా టికెట్లు 11.6 లక్షల అమ్ముడయ్యాయి. దీంతో మొదటి రోజు 100 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

సెప్టెంబర్ 27న శుక్రవారం Devara సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk వెల్లడించింది. Devara సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ రిలీజ్ కానుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా Devara సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.  

10 రోజల వరకే టికెట్ల పెంపు..

ఏపీలో టికెట్ల ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం Devara చిత్రబృందానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. అయితే ఈ విషయంపై తాజాగా ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేవర టికెట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10 రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్‌ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను విచారించిన కోర్టు పిటీషనర్‌ వాదనతో ఏకీభవించింది.

 పెరిగిన ధరలు ఎలా ఉంటాయంటే.. 

మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.135 పెరుగుతుంది. సింగిల్‌ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్‌పై అదనంగా రూ.110, లోయర్‌ క్లాస్‌ టికెట్‌పై రూ.60 అధికంగా ఉండనుంది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చంటూ సెప్టెంబర్‌ 21న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్‌పైన విచారించిన హైకోర్టు అదనపు ధరలను రెండు వారాల నుంచి 10 రోజులకు పరిమితం చేసింది. ఇదిలా ఉంటే దేవర చిత్రానికి తొలి రోజు ఆరు షోలు, ఆ తర్వాత 9 రోజులు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!