CISF Constable Recruitment 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుంచి కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1124 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్లి ఉన్న అభ్యర్థులు 4 మార్చి 2025లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఈ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేేసుకోగలరు.
CISF Constable Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టలు సంఖ్య : 1124
కానిస్టేబుల్ / డ్రైవర్ : 845
కానిస్టేబుల్ / డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ : 279
అర్హతలు :
CISF Constable Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. భారీ మోటార్ వాహనం లేదా లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. 167 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80-85 సెం.మీ ఉండాలి.
వయస్సు:
CISF Constable Recruitment 2025 ఉద్యోగాలు 04-03-2025 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 21 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలి. రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
Sangeet Natak Akademi Recruitment 2025 | సంగీత నాటక అకాడమీలో ఉద్యోగాలు | తక్కువ పోటీ ఉండే జాబ్స్
అప్లికేషన్ ఫీజు :
CISF Constable Recruitment 2025 పోస్టులకు UR / EWS / OBC అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. SC / ST / ESM అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
CISF Constable Recruitment 2025 ఉద్యోగాలను ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఓఎంఆర్ లేదా సీబీటీ విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో జరుగుతుంది. పీఈటీ/పీఎస్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ సమయంలో ఒరిజినల్స్ తో పాటు అవసరమైన అర్హత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.
జీతం :
CISF Constable Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం అందజేస్తారు.
దరఖాస్తు విధానం :
CISF Constable Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి CISF అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 03 – 02- 2025
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 04 – 03 – 2025
Registration : CLICK HERE
1 thought on “CISF Constable Recruitment 2025 | CISF కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు | 10th అర్హతతో 1124”