BRO Recruitment 2025 : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వెహికల్ మెకానిక్ మరియు మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 542 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల పురుష అభ్యర్థులు నవంబర్ 24వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్ అక్టోబర్ 11వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
BRO Recruitment 2025 Overview
నియామక సంస్థ | బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ |
పోస్టు పేరు | వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ (పెయింటర్, DES) |
పోస్టుల సంఖ్య | 542 |
దరఖాస్తులకు చివరి తేదీ | 24 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
Also Read : Central Coalfields Apprentice Recruitment 2025 | సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో బంపర్ జాబ్స్ – 1180 ఖాళీలు
ఖాళీల వివరాలు:
Border Roads Organisation (BRO) భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ సంస్థ. దీని ప్రధాన లక్ష్యం దేశ సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడం, మరమ్మతు చేయడం, నిర్వహించడం. ఈ సంస్థ నుంచి వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ (పెయింటర్, DES) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 542 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
వాహన మెకానిక్ | 324 |
MSW(పెయింటర్) | 12 |
MSW(DES) | 205 |
మొత్తం | 542 |
అర్హతలు :
BRO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
BRO Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BRO Recruitment 2025 అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.50/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
BRO Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- శారీరక సామర్థ్య పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Also Read : PRL Recruitment 2025 | అంతరిక్ష పరిశోధన సంస్థలో జాబ్స్
జీతం వివరాలు :
BRO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
- వెహికల్ మెకానిక్(లెవల్-2) : రూ.19,900 – రూ.63,200/-
- MSW(పెయింటర్, DES)(లెవల్-1) : రూ.18,000 – రూ.56,900/-
దరఖాస్తు విధానం :
BRO Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://bro.gov.in/ లోకి వెళ్లాలి.
- అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- SBI కలెక్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి పంపాలి.
చిరునామా :
- కమాండెంట్, GREF సెంటర్, దిఘి క్యాంప్, పూణే, మహారాష్ట్ర-411015
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 నవంబర్, 2025
Short notification | Click here |
Official Website | Click here |
Also Read : RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
1 thought on “BRO Recruitment 2025 | రోడ్స్ ఆర్గనైజేషన్ లో 542 జాబ్స్.. వివరాలు ఇవిగో..”