APSSDC German Language Training : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులుకు మంచి అవకాశం కల్పించింది. జర్మనీ భాషలో శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా భారీ జీతాలతో జర్మనీలో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ ద్వారా మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు :
APSSDC మరియు 2COMS జర్మనీలో నైపుణ్యం కలిగిన మెకాట్రానిక్స్ జాబ్స్ ని అందిస్తోంది. APSSDC & 2COMS సహకారంతో నైపుణ్యం కలిగిన మెకట్రానిక్స్ నిపుణుల కోసం జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణతో పాటు మెకాట్రోనిక్స్ ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
అర్హతలు :
మెకాట్రోనిక్స్ / ఎలక్ట్రికల్ / ఎనర్జీ సిస్టమ్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ఫీల్డ్ లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు :
జర్మన్ భాషలో శిక్షణ మరియు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ట్రైనీంగ్ పీరియడ్:
జర్మన్ భాషలో శిక్షణ మరియు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఏ1, ఏ2, బీ1 లెవల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ ఆఫ్ లైన్ లోనే ఉంటుంది. బీ1 లెవల్ శిక్షణ మాత్రం ఆఫ్ లైన్ , ఆన్ లైన్ లో కూడా ఉంటుంది.
శిక్షణ జరిగే వేదిక: విజయవాడ / విశాఖపట్నం
ఎంపిక ప్రక్రియ:
జర్మన్ భాషలో శిక్షణ మరియు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష మరియు టెక్నికల్ స్కిల్ అసెస్మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు రెండు సంవత్సరాల పాటు జర్మనీలో పనిచేయాల్సి ఉంటుంది.
జీతం :
శిక్షణ పూర్తి చేసుకుని జర్మనీలో ఉద్యోగాలనికి ఎంపికైన వారికి నెలకు 2,800 యూరో నుంచి 3,600 యూరోల వరకు జీతాలు ఉంటాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.2.46 లక్షల నుంచి రూ.3.40 లక్షల వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో కింది డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది.
- పాస్ పోర్ట్
- 10వ తరగతి సర్టిఫికెట్
- డిగ్రీ/ డిప్లోమా సర్టిపికెట్స్
- ఎక్సీ పీరియన్స్ సర్టిఫికెట్
- లైట్, హెవీ వెహికల్ లైసెన్స్
- రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు
ఇతర వివరాలు :
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెసిడెెన్షియల్ శిక్షణతో పాటు ఉద్యోగానికి ఎంపికైన వారికి వీసా, విమాన ఖర్చులు జాబ్ ఇచ్చే కంపెనీ భరిస్తుంది. అంతే కాదు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. అయితే డాక్యుమెంట్ ఖర్చులకు అభ్యర్థులు రూ.30,000/- వరకు చెల్లించాలి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు రెండు విడతులుగా రూ.40,000/- రీఫండబుల్ డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ మొత్తాన్ని జర్మనీ వెళ్లిన తర్వాత తిరిగి రీఫండ్ చేస్తారు.
సంప్రదించాల్సిన నెంబర్లు:
ఇతర వివరాల కోసం 9988853335, 8790118349 నెంబర్లను సంప్రదించి అదనపు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 25 – 03 – 2025
Apply Link : CLICK HERE
Official Website : CLICK HERE