ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!
AP Nominated Posts List..
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది.
ఛైర్మన్లను నియమించిన కార్పొరేషన్లు ఇవే..
1 వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
2 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) – అనిమిని రవినాయుడు
3 AP హౌసింగ్ బోర్డ్ – బత్తుల తాత్యబాబు
4 AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బొరగం శ్రీనివాసులు
5 AP మారిటైమ్ బోర్డ్ – దామచర్ల సత్య
6 SEEDAP (APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి
7.20 పాయింట్ ఫార్ములా – లంకా దినకర్ (బీజేపీ)
8.AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
9 AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి
10 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC – మంతెన రామరాజు
11 AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య
12 AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
13 APSRTC-చైర్మన్, APSRTC వైస్ చైర్మన్ – కొనకళ్ల నారాయణ, పిఎస్ మునిరత్నం
14 AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
15 లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
16 AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి – పీతల సుజాత
17 A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన)
18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సుధీర్( జనసేన)
19 ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) వజ్జా బాబురావు
20 AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO – వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన)
Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.