ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేేయనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ విషయాన్ని ప్రకటించారు. సుమారు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి ఉన్నత చదువుల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. సచివాలయాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతోంది. వారిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP Grama Sachivalayam Latest Vacancies 2025 :
పోస్టుల వివరాలు:
2019లో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు దీనిని తీసుకొచ్చాారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ఖాళీగు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. ఈ పోస్టు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వంటి పోస్టులు ప్రధానమైనవి.
మొత్తం పోస్టుల సంఖ్య : 30,000 (అంచనా)
విద్యార్హతలు:
AP Grama Sachivalayam Latest Jobs 2025 గత నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్హతలు చూసుకుంటే.. ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. పోస్టుకు అనుగణంగా ఇంటర్ / డిగ్రీ / డిప్లొమా అర్హతలు ఉన్న వారు గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
AP Grama Sachivalayam Latest Jobs 2025 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి ప్రారంభంలో రూ.15,000/- జీతం ఇస్తారు. రెండు సంవత్సరాలు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. రెండు సంవత్సరాల తర్వాత రూ.25,000/- జీతం ఉంటుంది. ఈ సమాచారం గత నోటిఫికేషన్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
AP Grama Sachivalayam Latest Jobs 2025 : ప్రస్తుతం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తాజా సమాచారం ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మే, 2025లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. అభ్యర్థులు అయితే ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టి రెడీగా ఉంటే మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రిపరేషన్ కి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఇచ్చింది. చాలా మంది ప్రిపేర్ అయ్యేందుకు సమయం దొరకలేేదు. అందుకే ఈసారి ముందుగానే ప్రిపరేషన్ మొదలు పెడితే జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి పోస్టుల భర్తీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా మరియు వేేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
I want this job
Super
It’s nice
Super
This year very important