AP DSC Mock Test 2025 ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ రాసే అభ్యర్థులకు కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురుచూసిన డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయ్యింది. తర్వలోనే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈక్రమంలో ఓ మరో కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి. ఈ లింక్ ఓపెన్ చేయాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
AP DSC Mock Test 2025 ఏపీ డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మే 15వ తేదీన ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉండగా.. 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ డీఎస్సీకి తెలంగాణ, మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డీఎస్సీ పరీక్షలు విడుతల వారీగా జూలై 6వ తేదీ వరకు జరుగుతాయి. ఏపీకి డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు కూడా మే 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP DSC Mock Test 2025 ఇక ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అభ్యర్థులు ఎలాగైన జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో హార్డ్ గా ప్రీపరేషన్ అయితే చేస్తున్నారు. చాలా మందికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష గురించి అంతగా తెలీదు. ఈక్రమంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారి కోసం మాట్ టెస్ట్ ఆప్షన్లు తీసుకొచ్చింది. దీని ద్వారా అసలు పరీక్ష విధానం ఎలా ఉంటుంది? ప్రశ్నలు ఎలా అడుగుతారు? సమయం సరిపోతుందా? లేదా? అనే విషయాలను ఈ మాక్ టెస్ట్ రాసి తెలుసుకోవచ్చు. మరీ ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP DSC Mock Test 2025
ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి?
ఏపీ విద్యాశాఖ డీఎస్సీ అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా మాక్ టెస్ట్ రాయవచ్చు.
- అభ్యర్థులు ముందుగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.in/ ని సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- హోమ్ పేజీ కింద Mock Test Links ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.
- అభ్యర్థులు సబ్జెక్ట్ రాస్తున్నారో ఆ పోస్టు పక్కన Click here లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థులు యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ చూపిస్తుంది. అయితే అవేమి అవసరం లేకుండా డైరెక్ట్ గా సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Next ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఆప్షన్ పై క్లిక్ చేస్తే ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. అలా మీరు ఎన్ని సార్లు అయినా పరీక్ష రాయవచ్చు.