AP Digital Lakshmi Scheme | ఏపీ మహిళల కోసం ‘డిజిటల్ లక్ష్మి’ స్కీమ్

AP Digital Lakshmi Scheme ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్ద శుభవార్త ఇది. వీరందరికి ఉపాధిని కల్పించబోతుంది. అది కూడా ఇంటి దగ్గరే సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకోసం ‘డిజిటల్ లక్ష్మి’ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరికీ ఉపాధి కింద రూ.2 లక్షలు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ లలో వీరిని భాగస్వాములను చేసి, స్కీమ్స్ ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మధ్య వర్తిగా ఈ డిజిటల్ లక్ష్మీ తీసుకురావడం జరుగుతుంది.

ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘డిజిటల్ లక్ష్మి’ పథకం ద్వారా మీ సేవ కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను ఇప్పటి నుంచి మహిళలు అందించనున్నారు. అందుకోసం మహిళలకు కామన్ సర్వీస్ సెంటర్లను మంజూరు చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అప్లయ్ చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం ఈ పథకాన్ని తీసుకొస్తుంది.

డిజిటల్ లక్ష్మి పథకానికి అర్హతలు : 

  • స్వయం సహాయక సంఘంలో 3 సంవత్సరాలు పొదుపు చేసిన మహిళలు
  • డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 
  • 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ సహాయం ఎంత?

AP Digital Lakshmi Scheme డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన మహిళలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుంది. బ్యాంక్ ద్వారా రూ.2 లక్షలు లోన్ ఇవ్వనుంది. ఈ లోన్ ద్వారా డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలు ఇంటి వద్ద మీసే తరహాలో ఏర్పాటు చేసుకోవచ్చు. 

డిజిటల్ లక్ష్మి చేయాల్సిన పని ఏంటీ?

  • డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన మహిళ డ్వాక్రా మహిళలతో పాటు స్థానికులకు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు, ఇతర డిజిటల్ సేవలన అందించాలి. 
  • ఇంటి దగ్గరే చిన్న షాపు పెట్టుకుని మీ సేవా కేంద్రం తరహాలో పనిచేయాల్సి ఉంటుంది. 

ఎలా ఎంపిక చేస్తారు?

పట్టణాల్లో ఒక్కో ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 25 స్వయం సహాయక సంఘాలు ఉంటాయి. ఈ స్వయం సహాయక సంఘాల పరిధిలో సుమారు 250 కుటుంబాల వారు నివసిస్తుంటారు. ఈ విధంగా ఒక్కో ఎస్ఎల్ఎఫ్ పరిధిలో ఒకరిని ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన వారికి అసరమైతే శిక్షణ కూడా ఇస్తారు. ప్రభుత్వమే అన్ని సమకూరుస్తుండటంతో ఇది మంచి ఉపాధి అవకాశంగా చెప్పొచ్చు. 

4 thoughts on “AP Digital Lakshmi Scheme | ఏపీ మహిళల కోసం ‘డిజిటల్ లక్ష్మి’ స్కీమ్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!