BSF Sports Quota Recruitment 2025 : భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన Border Security Force (BSF) స్పోర్ట్స్ కోటా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన క్రీడాకారులు కోసం Constable (General Duty) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 549 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 27 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.
ఖాళీల వివరాలు (Vacancies)
ఈ నియామకంలో మొత్తం 549 Constable (GD) ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు 30కి పైగా క్రీడా విభాగాల్లో ఉన్నాయి. Athletics, Boxing, Wrestling, Shooting, Swimming, Football, Hockey, Volleyball, Weightlifting, Kabaddi, Taekwondo, Judo, Archery, Gymnastics తదితర క్రీడల్లో ఖాళీలు ఉన్నాయి. పురుషులు మరియు మహిళలకు రెండింటికీ ఖాళీలు ఉన్నాయి.
- పురుషులు : 277 పోస్టులు
- మహిళలు : 272 పోస్టులు
Also Read : BARC OCES–DGFS 2026 Notification | BARCలో భారీ నోటిఫికేషన్ – సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు (Eligibility)
BSF Sports Quota Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- గత 2 సంవత్సరాల్లో (15/01/2024 – 15/01/2026) కింద ఇచ్చిన క్రీడల్లో విజయాలు సాధించి ఉండాలి.
- International competitions (medal/participation)
- National Games / Senior National Championship
- Youth/Junior National Championships
- టీమ్ ఈవెంట్స్‌లో పాల్గొన్న వారు కూడా అర్హులే.
- క్రీడాకారుడు తప్పనిసరిగా main playing member అయి ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
BSF Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 01 ఆగస్టు 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
BSF Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC (NCL) పురుషులు: ₹159/-
- SC / ST / Women: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process)
BSF Sports Quota Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ఎంపిక పూర్తిగా స్పోర్ట్స్ మెడల్స్ మరియు పనితీరు ఆధారంగా జరుగుతుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (అసలు సర్టిఫికేట్ తనిఖీ)
- Physical Standard Test (PST)
- Merit List : క్రీడా విజయాల ఆధారంగా మార్కులు కేటాయింపు
- Detailed Medical Examination (DME)
జీతం వివరాలు (Salary)
BSF Sports Quota Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన కమిషన్ ప్రకారం ఆకర్షణీయమైన జీతాలు చెల్లించడం జరుగుతుంది.
- Pay Level-3: ₹21,700 – ₹69,100 + ఇతర అలవెన్సులు
- TA, DA, HRA, Risk Allowances, Ration Allowance వంటి BSF సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి
- New Pension Scheme (NPS) వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
BSF Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసకోవాలి.
- BSF Recruitment Website https://rectt.bsf.gov.in ఓపెన్ చేయాలి.
- నోటిఫికేషన్ ఓపెన్ చేసి Apply Online క్లిక్ చేయండి.
- ప్రొఫైల్ క్రియేట్ చేసి — వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి.
- అర్హులైన క్రీడా సర్టిఫికేట్లను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
- అవసరమైతే ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్‌ను ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 27 డిసెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 జనవరి, 2026
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : IOCL Non Executive Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 394 పోస్టులు
2 thoughts on “BSF Sports Quota Recruitment 2025 | 549 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల”