GHMC Recruitment 2025 : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)లో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 3, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) తన Metropolitan Surveillance Unit (MSU), Hyderabad లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 17 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడం, వ్యాధి నియంత్రణ మరియు డేటా సేకరణలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు నిపుణులను నియమించనున్నారు.
- Senior Public Health Specialist – 1
- Public Health Specialist – 1
- Assistant Public Health Specialist – 1
- Microbiologist – 1
- Entomologist – 1
- Veterinary Officer – 1
- Food Safety Expert – 1
- Admin Officer – 1
- Technical Officer (Finance) – 1
- Research Assistant – 1
- Technical Assistant – 1
- Multipurpose Assistant – 1
- Training Manager – 1
- Technical Officer (IT) – 1
- Data Analyst – 1
- Data Manager – 1
- Communication Specialist – 1
Also Read :NTPC Deputy Manager Recruitment 2025 | NTPCలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్
అర్హతలు మరియు వయోపరిమితి :
GHMC Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు వయోపరిమితి మారుతుంది. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
- సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్: MBBS + MD/DNB/సమానమైన అర్హతలు, పబ్లిక్ హెల్త్‌లో 10 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 60 సంవత్సరాలు.
- పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్: సంబంధిత అర్హతలు, కనీసం 3 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 50 సంవత్సరాలు.
- మైక్రోబయాలజిస్ట్: MBBS + MD/DNB లేదా M.Sc.+PhD, కనీసం 3 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 50 సంవత్సరాలు.
- ఎంటమాలజిస్ట్: M.Sc. (ఎంటమాలజీ/జువాలజీ), 5 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 50 సంవత్సరాలు.
- వెటర్నరీ ఆఫీసర్: వెటర్నరీ పబ్లిక్ హెల్త్/ఎపిడెమియాలజీలో PG, రిజిస్ట్రేషన్ తప్పనిసరి, వయస్సు గరిష్టంగా 50 సంవత్సరాలు.
- ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్: ఫుడ్ సేఫ్టీ సంబంధిత అర్హతలు, బ్యాచిలర్స్ తర్వాత 5 సంవత్సరాలు లేదా PG తర్వాత 3 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 40 సంవత్సరాలు.
- టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ): M.Tech/MCA/MBA(IT), 4 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 50 సంవత్సరాలు.
- డేటా అనలిస్ట్: స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్లలో నైపుణ్యం, 5 సంవత్సరాల అనుభవం, వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు.
- కమ్యూనికేషన్ స్పెషలిస్ట్: మాస్ కమ్యూనికేషన్/డిజిటల్ మీడియా PG లేదా డిప్లొమా, అనుభవం 3-5 సంవత్సరాలు, వయస్సు గరిష్టంగా 40 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు :
GHMC Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
GHMC Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
- విద్యార్హతలు – 80 మార్కులు
- అనుభవం – 10 మార్కులు (ప్రతి సంవత్సరం = 1 మార్కు, గరిష్టం 10)
- ఇంటర్వ్యూ – 10 మార్కులు
మొత్తం – 100 మార్కులు
Also Read : BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 86 ఖాళీలు.. ఇలా అప్లయ్ చేయండి
జీతం వివరాలు
GHMC Recruitment 2025 ఎంపికైన పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులను 12 నెలల కాంట్రాక్ట్ పై తీసుకుంటారు. పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగిస్తారు.
- సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్: గరిష్టంగా ₹1,75,000
- పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్: ₹90,000 – ₹1,25,000
- మైక్రోబయాలజిస్ట్: మెడికల్ వారికి ₹1,25,000, నాన్-మెడికల్ వారికి ₹1,00,000
- ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్: ₹75,000
- ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్: ₹50,000
- టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ): ₹75,000
- డేటా అనలిస్ట్: ₹60,000
- కమ్యూనికేషన్ స్పెషలిస్ట్: ₹50,000
- టెక్నికల్ అసిస్టెంట్ : రూ.30,000
- మల్టీపర్సస్ అసిస్టెంట్ : రూ.25,000
దరఖాస్తు విధానం:
GHMC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్: https://ghmc.gov.in/MSUApplicationForm.aspx ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాలి.
- దరఖాస్తులో అవసరమైన వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను స్వీయ ధృవీకరించిన కాపీలతో అప్లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 3 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 18 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DSSSB TGT Teacher Recruitment 2025 | 5,346 TGT టీచర్ జాబ్స్.. పూర్తి వివరాలు ఇవిగో..