VISMUSEUM Recruitment 2025 : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నలాజికల్ మ్యూజియం(VITM) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

VISMUSEUM Recruitment 2025 Overview
నియామక సంస్థ | విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నలాజికల్ మ్యూజియం |
పోస్టు పేర్లు | ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ |
ఖాళీలు | 12 |
దరఖాస్తు ప్రక్రియ | 20 సెప్టెంబర్ – 20 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | బెంగళూరు, తిరుపతి, కాలికల్ గుల్బర్గా |
Also Read : SSC Delhi Police Constable Driver recruitment 2025 | 737 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ కింద ఉన్న విశ్వేశ్వరయ్య ఇండిస్ట్రియల్ మరియు టెక్నలాజికల్ మ్యూజియం నుంచి వివిధ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు | లొకేషన్ |
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘ఎ’ | 1 | VITM, బెంగళూరు |
టెక్నీషియన్ ‘ఎ’ | 6 | VITM – బెంగళూరు, RSC – తిరుపతి |
ఆఫీస్ అసిస్టెంట్ | 5 | VITM-బెంగళూరు, DSC-గుల్బర్గా, RSC&P-కాలికట్ |
అర్హతలు :
VISMUSEUM Recruitment 2025 ప్రతి పోస్టుకు విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘ఎ’ : ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ
- టెక్నీషియన్ ‘ఎ’ : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ
- ఆఫీస్ అసిస్టెంట్ : టైపింగ్ స్పీడ్ తో హయ్యార్ సెకండరీ పాస్
వయోపరిమితి :
VISMUSEUM Recruitment 2025 ఎగ్జిబిషన్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
VISMUSEUM Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC / ST / PwD / ESM / Women : ఫీజు లేదు
- ఇతర కేటగిరీ అభ్యర్థులకు : రూ.885/-
ఎంపిక ప్రక్రియ :
VISMUSEUM Recruitment 2025 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి రాత పరీక్ష మరియు నైపుణ్య పరీక్ష లేదా టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే తర్వాతి రౌండ్లకు పిలుస్తారు.
- నైపుణ్య పరీక్ష / టైపింగ్ టెస్ట్
- రాత పరీక్ష
Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
VISMUSEUM Recruitment 2025 ఎంపకైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఎగ్జిబిషన్ అసిస్టెంట్ : పే మ్యాట్రిక్స్ లెవల్-5 ప్రకారం రూ.29,200 – రూ.92,300/- వరకు జీతం ఇస్తారు. అన్ని కలుపుకొని నెలకు రూ.59,600/- వరకు జీతం లభిస్తుంది.
- టెక్నీషియన్ అసిస్టెంట్ : ఎంపికైన అభ్యర్థులకు లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/- వరకు జీతం ఉంటుంది. బెంగళూరులో అయితే నెలకు రూ.38,908/- మరియు తిరుపతిలో అయితే నెలకు రూ34,230/- జీతం లభిస్తుంది.
- ఆఫీస్ అసిస్టెంట్ : ఎంపికైన అభ్యర్థులకు లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/- వరకు జీతం ఉంటుంది. బెంగళూరులో అయితే నెలకు రూ.38,908/-, కోజికోడ్ లో నెలకు రూ.36,918/- మరియు కాలబురగిలో అయితే నెలకు రూ.36,220/- జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
VISMUSEUM Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కావాల్సిన పోస్ట్ కోసం లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖస్తు ప్రారంభ తేదీ : 20 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : ISRO VSSC Driver Notification 2025 | ఇస్రోలో డ్రైవర్, కుక్ పోస్టులకు నోటిఫికేషన్