ADA Project Assistant Recruitment 2025: రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవడానికి ఇది మంచి అవకాశం.

ADA Project Assistant Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ |
శాఖ | రక్షణ మంత్రిత్వ శాఖ |
పోస్టు పేరు | ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 |
మొత్తం ఖాళీలు | ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి మారుతుంది. |
జాబ్ లొకేషన్ | బెంగళూరు (లేదా ఇతర ADA పని కేంద్రాలు) |
దరఖాస్తు విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీలు | 16, 17, 19 & 22 సెప్టెంబర్, 2025 |
Also Read : Balmer Lawrie Recruitment 2025 | భారీ జీతంతో ఎగ్జిక్యూటివ్ జాబ్స్
ఖాళీల వివరాలు :
భారతదేశ రక్షణ మరియు ఏరోస్పేస్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్యను ప్రకటించలేదు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 విభాగాలు :
- ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్ఫర్మేషన్ సైన్స్
- మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్
అర్హతలు :
ADA Project Assistant Recruitment 2025 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు విభాగాలను బట్టి విద్యార్హతలు మారుతాయి.
- ఏరోనాటికల్, మెకానిక్, E&C విభాగాలు : BE / B.Tech + గేట్ స్కోర్ లేదా ME / M.Tech లేదా BE / B.tech + అనుభవం
- కంప్యూటర్ సైన్స్ మరియు E&C విభాగాలు : కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫోసైన్స్ / ఇన్ఫోటెక్ / ఎలక్ట్రానిక్స్ / టెలికాంలో BSc మరియు MSc + JRF / లెక్చరర్ షిప్ కోసం చెల్లుబాటు అయ్యే గేట్ / నెట్ స్కోర్ లేదా సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి :
ADA Project Assistant Recruitment 2025 అభ్యర్థులకు 15 సెప్టెంబర్, 2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ADA Project Assistant Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
ADA Project Assistant Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఉంటుంది.
Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్
జీతం వివరాలు :
ADA Project Assistant Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలపుకొని నెలకు రూ.48,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
ADA Project Assistant Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫారమ్ కి ఇటీవలి పాస్ సైజ్ ఫొటో అతికించాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- అభ్యర్థుల విభాగానికి షెడ్యూల్ చేసిన తేదీలో వాక్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ – క్యాంపస్ 2, సురంజన్ దాస్ రోడ్, న్యూ తిప్పసంద్ర పోస్ట్, బెంగళూరు – 560075
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు :
విభాగాలు | ఇంటర్వ్య తేదీ మరియు రిపోర్టింగ్ సమయం |
ఏరోనాటికల్ / ఏరోస్పేస్ | 16 సెప్టెంబర్, 2025 (ఉదయం 08:00 నుంచి 08:30 వరకు) |
కంప్యూటర్ సైన్స్ / ఐటీ | 17 సెప్టెంబర్, 2025 (ఉదయం 08:00 నుంచి 08:30 వరకు) |
మెకానికల్ / ప్రొడక్షన్ | 19 సెప్టెంబర్, 2025 (ఉదయం 08:00 నుంచి 08:30 వరకు) |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ | 22 సెప్టెంబర్, 2025 (ఉదయం 08:00 నుంచి 08:30 వరకు) |
Notification | Click here |
Application form | Click here |
Official Website | Click here |
Also Read : IOB Specialist Officers Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్
H. Ganesh
12pass