Google Software Engineering Intern Summer 2026 ప్రతి ఒక్కరి కలల కంపెనీ అయిన గూగుల్ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ షిప్ చేసే అవకాశం వచ్చింది. ఇండియాలో Google Software Engineering Intern Summer 2026 కోసం గూగుల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్ లో మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థుల కోసం Google India 10 నుంచి 12 వారాల పెయిడ్ ఇంటర్న్ షిప్ ని అందిస్తోంది.
Google Software Engineering Intern Summer 2026
ఇంటర్న్ షిప్ వివరాలు :
కంప్యూటర్ సైన్స్ లో టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం Google ఓ గోల్డెన్ ఛాన్స్ తీసుకొచ్చింది. గూగుల్ లో ఇంటర్న్ షిప్ చేసిన విద్యార్థులకు బయట కంపెనీల్లో మంచి ప్యాకేజీతో అవకాశాలు వస్తాయి. Google Software Engineering Intern Summer 2026 10 నుంచి 12 వారాల పాటు జరుగుతుంది. ప్రస్తుతం మారిన టెక్నాలజీకి అనుగుణంగా నూతన కోర్సుల్లో రాణించాలనుకునే వారికి ఈ ఇంటర్న్ షిప్ బెస్ట్ ఛాయిస్ గా చొప్పొచ్చు.
Google Software Engineering Internship Location :
ఇండియాలోని వివిధ స్థానాల్లో గూగుల్ ఇంటర్న్ షిప్ ని అందిస్తుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో తమకు నచ్చిన స్థానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
- బెంగళూరు, కర్ణాటక
- హైదరాబాద్, తెలంగాణ
- పూణే, మహరాష్ట్ర
Google Internships Qualifications :
Google Software Engineering Intern Summer 2026 కోసం దరఖాస్తు చేసుకునే వారికి కింది అర్హతలు ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత టెక్నికల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీలో చేరి ఉండాలి.
- జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన Java, C/C++, Python, JavaScript, Go వంటి వాటిలో ఏదైనా ఒక దాంట్లో అనుభవం ఉండాలి.
- Unix / Linux వంటి ఎన్విరాన్మెంట్స్ తో పని అనుభవం ఉండాలి.
- సాఫ్ట్ వేర్ డిజైన్ లో అనుభవం ఉండాలి.
ప్రాధాన్యత ఉన్న అర్హతలు :
- డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. (ఉదాహరణకు బీటెక్ 4వ సంవత్సరం, మాస్టర్ డిగ్రీలో 2వ సంవత్సరం)
- డేటా స్ట్రక్చర్లు మరియు అల్గోరిథంపై నాలెడ్జ్ ఉండాలి.
- మొబైల్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ పారాలల్ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రూవల్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నెట్ వర్కింగ్, డెవలపింగ్ లార్జ్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్, సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేసే సామర్థ్యం ఉండాలి.
- టెక్ ప్రాజెక్టులు మరియు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనే సామర్థ్యం ఉండాలి.
Selection Process for Google Internship:
Google Software Engineering Intern Summer 2026 కోసం ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్
- ఆన్ లైన్ అసెస్మెంట్ (కోడింగ్ లేదా అల్గొరిథమిక్ ఛాలెంజెస్)
- టెక్నికల్ ఇంటర్వ్యూ (1- 2 రౌండ్లు)
- ప్రాజెక్ట్ లేదా ప్రవర్తనా చర్చ
జీతం :
జీతం వివరాలు గూగుల్ ప్రకటించలేదు. కానీ Indeed ప్రకారం ఇంటర్న్ షిప్ సమయంలో నెలకు సుమారు రూ.1,08,135/- జీతం ఉంటుందని అంచనా.
ఇంటర్న్ షిప్ వ్యవధి మరియు సమయం :
- ఇంటర్న్ షిప్ ప్రారంభం : మే 2026
- ఇంటర్న షిప్ వ్యవధి : 10 – 12 వారాలు
How to Apply Google Software Engineering Intern Summer 2026 :
గూగుల్ ఇంటర్న్ షిప్ కోసం అభ్యర్థులు కింది దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది.
- సంబంధిత ఇంటర్న్ షిప్ పోస్ట్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- రెజ్యూమ్ మరియు ట్రాన్స్క్రిప్ట్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సమర్పించాలి.
కావాల్సిన పత్రాలు :
- నవీకరించబడిన CV / Resume
- అనధికారిక లేదా అధికారిక ట్రాన్స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో ఉండాలి.
Apply Link | Click here |