Azim Premji Scholarships 2025 | అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్ .. బాలికలకు సంవత్సరానికి రూ.30వేలు

Azim Premji Scholarships 2025 : దేశంలో విద్య నాణ్యత మరియు సమానత్వాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంలో భాగంగా అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ బాలికలకు స్కాలర్ షిప్స్ అందజేస్తోంది. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు మద్దతు ఇవ్వడం కోసం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ప్రతి సంవత్సరం రూ.30 వేలను అందిస్తుంది. ఈ స్కాలర్ షిప్స్ ని తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని ఫౌండేషన్ నిర్ణయించింది. మొత్తం 2.5 లక్షల మంది విద్యార్థినులకు స్కాలర్ షిప్స్ అందించాలని లక్ష్యంగా  పెట్టుకుంది. 

అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్ హైలైట్స్:

స్కాలర్ షిప్ అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్
సంస్థ పేరుఅజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్
లబ్ధిదారులు10వ మరియు ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు
అప్లికేషన్ విధానంఆన్ లైన్
స్కారల్ షిప్స్ సంఖ్య2.5 లక్షల మంది విద్యార్థినులకు
దరఖాస్తులుసెప్టెంబర్ 2025
అధికారిక వెబ్ సైట్https://azimpremjifoundation.org

అర్హతలు : 

Azim Premji Scholarships కోసం దరఖాస్తు చేసుకోవడానికి కింది అర్హతలు ఉండాలి. 

  • భారతీయ పౌరురాలు అయి ఉండాలి.
  • విద్యార్థినులు తమ 10వ తరగతి మరియు ఇంటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో పూర్తి చేసి ఉండాలి. 
  • డిగ్రీ లేదా డిప్లొమా కోర్సును చదవడానికి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలో చేరి ఉండాలి. 

స్కారల్ షిప్ ప్రయోజనాలు:

విద్యార్థిని తన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసే వరకు ఆమెకు ప్రతి సంవత్సరం రూ.30 వేలు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఇస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థిని 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు చేస్తుంది. ఆ విద్యార్థినికి ప్రతి సంవత్సరం రూ.30,000/- చొప్పున మొత్తం రూ.90 వేలు లభిస్తుంది. ఈ డబ్బులు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. 

కావాల్సిన డాక్యుమెంట్స్ : 

Azim Premji Scholarships కోసం దరఖాస్తు చేసుకోవడానికి కింది పత్రాలు అవసరం అవుతాయి. 

  • ఆధార్ కార్డు
  • మొబైల్ నెంబర్
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు
  • రెసిడెంట్ సర్టిఫికెట్
  • 10వ మరియు ఇంటర్ మార్క్స్ మెమోలు
  • ఇన్ కమ్ సర్టిఫికెట్

ఎంపిక ప్రక్రియ: 

Azim Premji Scholarships 2025 అనేది విద్యార్థి మెరిట్ ఆధారిత స్కాలర్ షిప్ కాదు. స్కాలర్ షిప్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థిని తన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉండాలి. కుటుంబ పరిస్థితి ఆధారంగా Azim Premji Scholarships ఇస్తారు. 

దరఖాస్తులు : 

Azim Premji Scholarships 2025 కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 2025-26 స్కారల్ షిప్ సైకిల్ కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 2025లో ప్రారంభమవుతుంది. 

ఏ రాష్ట్రాల్లో ఇస్తారు?

Azim Premji Scholarships ప్రోగ్రామ్ మొత్తం 18 రాష్ట్రాల్లో అమలవుతుంది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, త్రిపుర, ఛత్తీస్ గఢ్, సిక్కిం, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో అమలులో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ప్రారంభించలేదు. 

Leave a Comment

Follow Google News
error: Content is protected !!