By Jahangir

Published On:

Follow Us
AP District Court Copyist Jobs 2025

AP District Court Copyist Jobs 2025 | ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాలు

AP District Court Copyist Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో కాపీయిస్ట్ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 193 కాపీయిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను జిల్లాల వారీగా నియమిస్తారు. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  

AP District Court Copyist Jobs 2025

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 193 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కింద చూడవచ్చు. 

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

జిల్లా పేరుఖాళీల సంఖ్య
అనంతపురం13
తూర్పు గోదావరి17
గుంటూరు09
క్రిష్ణ36
కర్నూలు07
ప్రకాశం16
నెల్లూరు10
శ్రీకాకుళం11
విశాఖపట్నం17
విజయనగరం09
పశ్చిమ గోదావరి16
కడప15
చిత్తూరు17
మొత్తం193

అర్హతలు : 

ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ లో హైయర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.  

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్
  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఇంగ్లీష్ టైపింగ్ లో హైయర్ ఉండాలి.
  • స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి. 
  • అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు జిల్లా వారికి తెలుగుతో పాటు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా తెలిసి ఉండాలి. 
  • మిగితా అన్ని జిల్లాల వారికి కేవలం తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు అప్లయ్ చేసుకోవచ్చు.

వయస్సు: 

ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ / బీసీ / ఈడబ్ల్యూఈఎస్ అభ్యర్థులు రూ.800/- మరియు ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

UR / BC /EWSరూ.800/-
SC / ST / PwBDరూ.400/-

ఎంపిక ప్రక్రియ: 

ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత  పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 80 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. 50 మార్కులకు ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. 

రాత పరీక్ష విధానం :

 కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు..

TTD Food Safety Officer Jobs 2025
TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

జీతం వివరాలు: 

ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.23,780 – రూ.76,730/- వరకు జీతం చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: 

ఏపీ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్ ఎ మరియు పార్ట్ బి దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. పార్ట్ – ఎ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పార్ట్ – బిలో అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. పార్ట్ – ఎ లో జనరేట్ చేసుకున్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 – 05 – 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 02 – 06 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!