ANGRAU Recruitment 2025 ఏపీలోని ఆచార్య ఎన్జీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డ్రోన్ పలట్ కమ్ ట్రైనర్, ప్రోగ్రామింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీఈ, బీటెక్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 14వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చూసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ANGRAU Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 06
-డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్ – 04
-ప్రోగ్రామింగ్ ఇంజనీర్ – 01
-IOT, AI & ML & 3D ఇంజనీర్ – 01
అర్హతలు :
ANGRAU Recruitment 2025 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్, ప్రోగ్రామింగ్ ఇంజనీర్, IOT, AI & ML & 3D ఇంజనీర్ పోస్టులకు డిప్లొమా, బీఈ, బీటెక్ అర్హతలు ఉండాలి.
వయస్సు :
ANGRAU Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
CSIR IICT Technical Assistant Recruitment 2025 | టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ | నెలకు రూ.70 వేలు జీతం
ఎంపిక విధానం :
ANGRAU Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఫిబ్రవరి 17వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు ప్రతిభ చూపిన వారికి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి ఫిబ్రవరి 20న ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు మరియు జీతం :
ANGRAU Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 జీతం చెల్లించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
ANGRAU Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా తమ బయోడేటా మరియు ఫొటోతో స్కాన్ చేసిన సర్టిఫికెట్లను recruitment.angrauapsara@gmail.com మెయిల్ కు పీడీఎఫ్ రూపంలో పంపించాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08 – 02 – 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ : 14 – 02 – 2025
ఇంటర్వ్యూ తేదీ : 17 – 02 – 2025
ఉద్యోగంలో చేరే తేదీ : 20 – 02 – 2025
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Centre for APSARA, RARS, Lam, Guntur.
Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “ANGRAU Recruitment 2025 | అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాబ్స్”