Vizag TMC Recruitment 2025 | వైజాగ్ TMCలో జాబ్స్ | ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం

Vizag TMC Recruitment 2025: Vizag Tata Memorial Centre (Homi Bhabha Cancer Hospital Research Centre) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ సూపర్ వైజర్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూలు జరుగుతాయి.

Vizag TMC Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 12

సీనియర్ సూపర్ వైజర్ – 01
ప్రాజెక్టు కో ఆర్డినేటర్ – 01
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 08
డేేటా ఎంట్రీ ఆపరేటర్ – 2

అర్హతలు :

సీనియర్ సూపర్ వైజర్ : సీనియర్ సూపర్ వైజర్ పోస్టుకు పీజీతో పాటు 6 నెలల కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం కూడా అవసరం.

ప్రాజెక్టు కోఆర్డినేటర్ : ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుకు డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి. ఒక సంవత్సరం అనుభవం కూడా ఉండాలి.

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు డీగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి. దీంతో పాటు ఒక సంవత్సరం అనుభవం అవసరం.

డేటా ఎంట్రీ ఆపరేటర్ : డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటు ఒక సంవత్సరం అనుభవం అవసరం.

వయస్సు:

Vizag TMC Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

TTD SVIMS Recruitment 2025 | TTDలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | కొద్ది గంటలే గడువు

జీతం :

Vizag TMC Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి జీతాలు అయితే చెల్లిస్తారు. టాటా మెమోరియల్ సెంటర్ లో ఎంపికైన అభ్యర్థులకు చెల్లించే జీతాలు కింది విధంగా ఉంటాయి.

సీనియర్ సూపర్ వైజర్ : రూ.23,000/- నుంచి రూ.60,000/
ప్రాజెక్టు కో ఆర్డినేటర్ : రూ.21,100/- నుంచి రూ.45,000/-
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : రూ.21,100/- నుంచి రూ.45,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ : రూ.21,100 నుంచి రూ.45,000/-

ఇంటర్వ్యూ తేదీ : 18 – 02 – 2025

Vizag TMC Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. పై పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లోని మొదటి అంతస్తులో ఉద్యోగాలకు ఇంటర్వ్యులు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యుకు కావాల్సిన డాక్యుమెంట్స్:

బయోడేటా
పాస్ పోర్టు సైజ్ ఫొటోలు
పాన్ కార్డు జిరాక్స్
ఒరిజనల్ సర్టిఫికెట్స్
అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సెల్ఫ్ అటెస్టెడ్ సెట్

Notification : CLICK HERE

Official Website : CLICK HERE

1 thought on “Vizag TMC Recruitment 2025 | వైజాగ్ TMCలో జాబ్స్ | ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!